Friday, April 26, 2024
Friday, April 26, 2024

న్యాయానికి ముగింపు ఇలా ఉంటుందా ? : బిల్కిస్‌ బానో

20 ఏళ్ల కిందట నేడు అనుభవించిన వేదన మళ్లీ నన్ను బాధిస్తోందని బిల్కిస్‌ బానో తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 2022 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం సహా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన దోషులను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి విదితమే.వారు విడుదలవ్వడమే కాకుండా. దోషులు మిఠాయిలు, పూలదండలతో సత్కరించిన కొన్ని వీడియోలో సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. దీనిపై బిల్కిస్‌ బోనా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రమాదాన్ని దూరం చేసి భయంలేకుండా..ప్రశాంతతతో జీవించే హక్చు ప్రసాదించండంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు. ‘11 మంది దోషులు విడుదలయ్యారని తెలిసి..నాకు కలిగిన గాయం మళ్లీ తిరగబెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో నా మెదడు మొద్దుబారిపోయింది. న్యాయానికి ముగింపు ఇలా ఉంటుందా? ఈ దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థను నేను నమ్మాను. ఈ దేశ వ్యవస్థను నమ్మాను. అందుకే నేను అనుభవించిన బాధను అలవాటు చేసుకుంటూ జీవించడం ప్రారంభించాను.’అంటూ తన ఆవేదన వెళ్లగక్కారు. ‘ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధ నా ఒక్కదానిదే కాదు..కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి మహిళది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నా భద్రత గురించి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రమాదం నుంచి దూరం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భయం లేకుండా, ప్రశాంతంగా జీవించే హక్కును నాకు తిరిగి ఇవ్వండని కోరుతున్నారు. నాకు, నా కుటుంబానికి ఎలాంటి హానీ లేదని దయచేసి భరోసా కల్పించండి.’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. బిల్కిస్‌ భర్త యాకూబ్‌ను ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘మేము ఇంకా షాక్‌లో ఉన్నామని, దీన్ని సవాలు చేస్తామో లేదో తెలియదని పేర్కొన్నారు. తమ వద్ద లీగల్‌ పేపర్లు లేవని, తమకు చాలా విషయాలు తెలియవని, తమకు జరిగింది అన్యాయమన్నారు. దోషుల విడుదల గురించి తమకు తెలియజేయలేదని ఆయన ధ్రువీకరించారు. అసలు ఆ ఆలోచనే లేదని, తాము స్థానిక మీడియా ద్వారా తెలుసుకున్నాం’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img