Friday, April 19, 2024
Friday, April 19, 2024

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహాయం రూ.6,400 కోట్లతో కొత్త రోడ్లు

మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ లైన్స్‌
వచ్చే వర్షాకాలంలోగా పాతరోడ్లకు మరమ్మతులు
14లోగా బందరు పోర్టుటెండర్‌ ప్రక్రియ పూర్తి
అక్టోబరు చివరినాటికి భావనపాడు పోర్టు టెండర్లు
ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపైప్రత్యేక దృష్టి
సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు అందజేసే రూ.6,400 కోట్ల ఆర్థిక సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ లైన్‌ కొత్త రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్షించారు. ఈసందర్భంగా రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రగతి, ప్రతిపాదనలపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ - బెంగళూరు రహదారిని ఫాస్ట్‌ట్రాక్‌లో చేపడుతు న్నామని, విశాఖపట్నంలో షీలానగర్‌ సబ్బవరం జాతీయ రహదారిపైనా దృష్టిపెట్టామని, విశాఖపట్నం సిటీ గుండా అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్లే రహదారిలో ప్రధానమైన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ఇవన్నీ వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పట్టనున్నం దున పాత రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టి, మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగుచేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారని విమర్శించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తుండడం వల్ల రహదారులన్నీ దెబ్బతిన్నాయని, అయినప్పటికీ వనరులను సమీకరించుకుని వాటిని బాగు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. నడికుడి – శ్రీకాళహస్తి, కడప- బెంగళూరు, కోటిపల్లి-నర్సాపూర్‌, రాయదుర్గ్‌ – తుంకూర్‌ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి,మరికొన్ని మార్గాల్లో డబ్లింగ్‌ పనులు ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పోర్టులపై సమీక్ష సందర్భంగా అధికారులు ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను వివరించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేస్తామని తెలిపారు. తొలివిడతలో రూ. 2647 కోట్లు నిర్మాణం కోసం ఖర్చు అవుతుందని, అక్టోబరు 1 నుంచి నిర్మాణ పనులు ప్రారంభమవు తాయన్నారు. బ్రేక్‌వాటర్‌ పనులు నవంబర్‌ మొదటివారంలో మొదలుపెడతా మని, వచ్చే మే నాటికి కీలకమైన పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే అక్టోబరు చివరి నాటికి భావనపాడు పోర్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, మచిలీపట్నం పోర్టుకు సెప్టెంబరు 14లోగా టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని, దీని నిర్మాణాన్ని 30 నెలల్లోగా పూర్తిచేస్తామని చెప్పారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ గేట్‌వే పోర్టుకు భూములు విస్తారంగా ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, ఈ పోర్టుకు రోడ్లు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా పోర్టులున్న ప్రాంతాల్లో ఫ్రీ ట్రేడ్‌ వేర్‌ హౌసింగ్‌ జోన్స్‌ను అభివృద్ధి చేయల న్నారు. అనంతరం రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 9 ఫిషింగ్‌ హార్బర్ల ప్రగతిపై సీఎంకు అధికారులు వివరాలు తెలియజేశారు. ఉప్పాడ, మచిలీ పట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె వద్ద వచ్చే ఏడాది జూన్‌ నాటికి మొదటి ఫేజ్‌ హార్బర్లను పూర్తిచేస్తున్నామని,రెండో విడతలో బుడగట్ల పాలెం, పూడి మడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం, వాడరేవుల వద్ద పిషింగ్‌ హార్బర్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మా ణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, కర్నూలు, కడపల నుంచి విశాఖ పట్నానికి విమాన సౌకర్యాన్ని పెంచేదిశగా, విశాఖపట్నం, తిరుపతి ఎయిర్‌ పోర్టుల నుంచి ఇంటర్నేషనల్‌ కనెక్టివిటీని అభివృద్ధిచేయాలని సీఎం ఆదేశించారు. ఈసమావేశంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, శంకర నారాయణ ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img