Friday, April 19, 2024
Friday, April 19, 2024

పంజాబ్‌లో చెరకు రైతుల సమ్మె

జలంధర్‌లో రైల్‌రోడ్‌ రవాణాకు బ్రేక్‌

పెండిరగ్‌ బకాయి చెల్లింపు ధర పెంపునకు డిమాండు

చండీగఢ్‌ : చెరకు ధరల్లో పెంపును కోరుతూ పంజాబ్‌ జలంధర్‌లో రైతులు ఆందోళన శనివారానికి రెండవ రోజుకు చేరుకుంది. దీంతో రైళ్లతో పాటు జాతీయ రహదారిలో రాకపోకలు స్తంభించాయి. 69 రైళ్లు రద్దు అయ్యాయని, 54 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడం లేదా మళ్లించడం జరిగిందని ఫిరోజ్‌పూర్‌ డివిజన్‌ రైల్వే అధికారులు తెలిపారు. చెరకు పెండిరగ్‌ బకాయిలు, ధరల పెంపు నేపథ్య డిమాండ్లను పరిష్కరించాలని పంజాబ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు మంజూరయ్యేంత వరకు దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని శనివారం నిరసనకారులు తేల్చిచెప్పారు. అత్యవసర వాహనాలను అనుమతించినట్లు తెలిపారు. జలంధర్‌ జిల్లా, ధనోవలి గ్రామం దగ్గరలోని జాతీయ రహదారిపై జలంధర్‌ఫగవారా మార్గాన్ని నిరసనకారులు దిగ్బంధించారు. దీంతో జలంధర్‌, అమృత్‌సర్‌, పఠాన్‌కోట్‌ నుంచి వచ్చే వాహనాలను అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాల్సి వచ్చింది. జలంధర్‌ఛహేరూ సెక్షన్‌లో ఆందోళన చేపట్టిన రైతులు లూథియానాఅమృత్‌సర్‌, లూథియానాజమ్మూ రైల్వేట్రాకులను దిగ్బంధించగా అనేక రాళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వీటిలో అమృత్‌సర్‌న్యూదిల్లీ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ (02030), అమృత్‌సర్‌ డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ (04664), న్యూదిల్లీఅమృత్‌సర్‌ శతాబ్ది స్పెషల్‌ (02013), న్యూదిల్లీశ్రీమాతా వైష్ణోదేవి కత్రా శ్రీశక్తి స్పెషల్‌ (02461) ఉన్నాయి. భారతీ కిసాన్‌ యూనియన్‌ (దోయబా) ప్రధాన కార్యదర్శి సత్నామ్‌ సింగ్‌ సహని మాట్లాడుతూ, జాతీయ రహదారి వెంబడి సర్వీస్‌ మార్గంలో ‘రక్షాబంధన్‌’ కోసం ప్రయాణించే కుటుంబాలను అనుమతించినట్లు చెప్పారు. రూ.200`రూ.250 కోట్ల అరియర్స్‌ను చెల్లించాలని, చెరకుకు రాష్ట్ర హామీ ధర (ఎస్‌ఏపీ)ను పెంచాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని రైతులు డిమాండు చేశారు. కొద్ది రోజుల కిందట క్వింటాపై రూ.15 చొప్పున పంజాబ్‌ ప్రభుత్వం పెంపు ప్రకటనను తిరస్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img