Friday, April 19, 2024
Friday, April 19, 2024

పదవ రోజూ గందరగోళమే..

కొనసాగిన విపక్షాల ఆందోళనలు
నినాదాల నడుమ మూజువాణి ఓటు
లోక్‌సభలో ఒకటి, రాజ్యసభలో మూడు బిల్లుల ఆమోదం

న్యూదిల్లీ : పెగాసస్‌, కొత్త సాగు చట్టాలు, ధరల పెంపు తదితర అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. వరుసగా పదవ రోజు సభలు సజావుగా సాగలేక అనేకసార్లు వాయిదా పడ్డాయి. ఓ వైపు విపక్షాల నినాదాలు, ఆందోళనలు కొనసాగుతుంటే మరో వైపు మూజువాణి ఓట్లతో చర్చ లేకుండానే బిల్లు లను దిగువ, ఎగువ సభులు ఆమోదించాయి. అనంతరం ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ వాయిదా తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలప్పుడు తిరిగి సమావేశం కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధారణ బీమా సవరణ బిల్లును ప్రవేశపెట్టగా దానిని ఆమో దించిన సభాపతి రమాదేవి అనంతరం లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆపై 2 గంటల వరకు దిగువ సభ వాయిదా పడిరది. ఆందోళనలను విరమించేందుకు విపక్షాలు ఒప్పు కోలేదు. అటు రాజ్యసభలోనూ ఇదే దృశ్యం పున రావృతమైంది. గందరగోళం నడుమ ఇన్‌లాండ్‌ వెజల్స్‌ బిల్లు`2021ను ఎగువసభ ఆమోదించింది. అనేక వాయిదాల తర్వాత సభ 3.36 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడు వినియోగాధికారమిచ్చే (నం.4) బిల్లు, 2021Ñ వినియోగాధికారమిచ్చే (నం.3) బిల్లు,2021లకూ ఆమోదం తెలిపింది. బిల్లులపై చర్చలో పాల్గొనాలని సభాపతి భువ నేశ్వర్‌ కలితా కోరగా విపక్షాల సభ్యులు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. ఈ రెండు బిల్లులను ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ప్రవేశపెట్టగా చర్చకు వీలు పడక పోవడంతో రాజ్యసభ వాటిని ఆమోదించింది. భోజ నం విరామం అనంతరం సభ 2 గంటలకు సమా వేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ కార్యక లాపాలను నిర్వహించారు. రాజ్యాంగ (ఎస్టీ) ఆదే శాల (సవరణ) బిల్లు 2021ని గిరిజన వ్యవహారాల మంత్రిÑ ఇన్‌లాండ్‌ వెజల్స్‌ బిల్లును పోర్టులు, షిప్పింగ్‌ మంత్రి శర్బానంద సోనోవాల్‌ ప్రవేశ పెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్యలో మూజు వాణి ఓటు ద్వారా ఇన్‌లాండ్‌ వెజల్స్‌ బిల్లును ఆమోదించారు. దీనిని జులై 29 దిగువసభ ఆమో దించింది. కాగా, ఉదయం సభ ప్రారంభమై నప్పుడు రైతుల ఆందోళనపై చర్చను కాంగ్రెస్‌ ఎంపీలుÑ పెగాసస్‌ వ్యవహారంపై చర్చకు టీఎంపీ, వామపక్షాలు పట్టుపట్టాయి. సభకు అంతరాయం కలిగించకుండా సహకరిస్తామంటే రైతుల సమస్యలపై చర్చను పరిగణనలోకి తీసుకుం టామని చైర్మన్‌ వెంకయ్య నాయుడు తెలిపారు. ప్లకార్డులతో వెల్‌లోకి రావద్దు అని సూచించారు. అయితే ప్రతిపక్షాలు వెనక్కు తగ్గకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రశ్నోత్తరాలకు అనుమ తివ్వగా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగడంతో అరగంటకే సభను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img