Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పదివేలకు దిగొచ్చిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖంపడుతోంది. కొత్త కేసులు పదివేలకు దిగివచ్చాయి. మరోవైపు మరణాల సంఖ్యలో కూడా భారీ తగ్గుదల కనిపించడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,47,536కు చేరింది. ఇందులో 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,38,49,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,63,655 మంది మృతిచెందారు. కాగా, కరనా బారినపడి గడిచిన 24 గంటల్లో కొత్తగా 125 మంది మరణించగా, 11,926 మంది వైరస్‌ నుంచి బయట పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, గత 17 నెలల్లో ఇదే అతి తక్కువని తెలిపింది. అదేవిధంగా రికవరీ రేటు 98.26 శాతానికి చేరిందని, 2020 మార్చి తర్వాత అత్యధికమని పేర్కొన్నది. పాజిటివిటీ రేటు 1.12 శాతంగా ఉందని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img