Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పరిస్థితి తీవ్రం కాకముందే అప్రమత్తం కావాలి

డెల్టా వేరియంట్‌ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ త్వరితగతిన వ్యాపిస్తోందని, పరిస్థితి తీవ్రం కాక ముందే అన్ని దేశాలు అప్రమత్తం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. తొలుత భారత్‌లో వెలుగుచూసిన డెల్టావేరియంట్‌ అప్పుడే 132 దేశాలకు పాకిందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్‌ తప్ప కరోనా నుంచి తప్పించుకునేందుకు మరో ఉపాయం లేదన్నారు. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి, మరిన్ని వేరియంట్లు పుట్టకముందే మహమ్మారి అదుపునకు మనకు సమగ్ర వ్యూహం అవసరమని డబ్య్లూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ ట్రెడ్రోస్‌ ఆధనామ్‌ సూచించారు. ఇప్పటివరకు 4 వేరియంట్లను నిపుణులు కనుగొన్నారని, వైరస్‌ వ్యాపించే కొద్దీ మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. తమ సంస్థ పరిధిలోని ఆరు దేశాలకు గాను అయిదు దేశాల్లో ఇన్ఫెక్షన్లు గత 4 వారాల్లో సగటున 80 శాతం కేసులు పెరిగాయని వెల్లడిరచారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల సరఫరాలో సమతుల్యత కొరవడిరదని ఆందోళన వ్యక్తంచేశారు. పేద దేశాలకు ఇంకా సరిపడినన్ని టీకామందులు లభ్యం కావడం లేదని, ధనిక దేశాలు తమవద్ద వ్యాక్సిన్‌ ని నిల్వ ఉంచుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ సెప్టెంబరు కల్లా ప్రతి దేశం తమ జనాభాలో 10 శాతం, వచ్చే ఏడాది జులై నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కానీ ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ సాగుతున్న తీరును బట్టి చూస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చని టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఏమైనా అన్ని దేశాలూ పటిష్టమైన, సరైన ఫలితాలనిచ్చే వ్యూహం చేపట్టాలని, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఇప్పటికీ తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img