Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

జావెలిన్‌ త్రోలో సుమిత్‌ అంటిల్‌ ప్రపంచ రికార్డు
జపాన్‌ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. పురుషుల జావెలిన్‌ త్రో (ఎఫ్‌64) ఈవెంట్‌ ఫైనల్లో భారత అథ్లెట్‌ సుమిత్‌ అంటిల్‌ విజయం సాధించాడు. అత్యధికంగా 68.55 మీటర్ల దూరం తన ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. తన ఐదో అటెంప్ట్‌లో ఈ ఫీట్‌ సాధించడం ద్వారా సుమిత్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన రెండవ ప్రయత్నంలో 68.08మీ. త్రో తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మునుపటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వరుసగా మూడవ, నాల్గవ త్రోలలో, అతను 65.27 మీ. 66.71మీ. విసిరాడు. అయితే, సుమిత్‌ తన ఐదవ ప్రయత్నంలో మూడవసారి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదే పోటీలో ఉన్న మరో భారతీయుడు సందీప్‌ కూడా అత్యధికంగా 62.20 మీటర్ల దూరం ఈటెను విసిరి తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సుమిత్‌ అంటిల్‌ సాధించిన గోల్డ్‌ మెడల్‌తో కలిపి పారాలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటివరకు రెండు బంగారు పతకాలు సాధించినట్లయ్యింది. మొత్తం పతకాల సంఖ్య ఏడుకు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img