Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు

మనీష్‌కు స్వర్ణం, సింగ్‌రాజ్‌కు రజతం
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే అవనీ లేఖరా ఒక స్వర్ణం, ఒక కాంస్యం కైవసం చేసుకొంది. తాజాగా శనివారం జరిగిన షూటింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. మిక్స్‌డ్‌ 50 మీటర్స్‌ పిస్టల్‌ విభాగంలో మనీష్‌ నర్వాల్‌ మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో గోల్డ్‌ మెడల్స్‌ సంఖ్య మూడుకి చేరింది. ఇక భారత్‌కు చెందిన మరో ప్లేయర్‌ సింగ్‌ రాజ్‌ సిల్వర్‌ పతకాన్ని గెలుచుకున్నాడు. పీ1 పురుషుల పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో భారత్‌కు రెండు అత్యుత్తమ పతకాలు రావడం ప్రత్యేకం. ఇప్పటివరకు భారత్‌కు పారాలింపిక్స్‌లో 15 పతకాలు వచ్చాయి.
కాగా పారాలింపిక్స్‌లో భారత్‌కు ఖాతాలో మరో రెండు పతకాలను చేర్చిన మనీష్‌, సింగ్‌ రాజ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు ప్లేయర్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలను కొనసాగించాలంటూ మోడీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img