Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి : సీఈసీ చంద్ర

న్యూదిల్లీ : పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, ఇది పెరగాల్సిన అవసరం ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్ర నొక్కిచెప్పారు. ఇటీవల ఓటు వేసేం మహిళల సంఖ్య పెరిగిందని చెప్పారు. పార్లమెంటు వాయిదాలతో విలువైన సభాసమయం వృధా అవుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. చంద్ర శనివారం సంసద్‌ రత్న అవార్డుల కార్యక్రమంలో మాట్లాడారు. తొలి లోక్‌సభలో 15 మంది ఎంపీలు ఉండగా 17వ లోక్‌సభలో 78 మంది ఉన్నారుకానీ ఆ తర్వాత సంఖ్య తగ్గుతూ వచ్చిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్‌కు రాజ్యాంగం హామీనిచ్చిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో చాలా మంది మహిళా నేతలు తమ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని, తమ వర్గాల్లో మార్పులు తేగలిగారన్నారు. చట్టసభ్యులకు, ప్రజలకు మధ్య అనుబంధం ముఖ్యమని, కోవిడ్‌ కారణంగా ప్రచారాలపై నిషేధం విధించినప్పుడు కొందరు నేతలు చాలా కాలం తర్వాత తమ గడపలు తొక్కారని ఓటర్లు తనతో చెప్పారని చంద్ర అన్నారు. పార్లమెంటు సెషన్లు వాషౌట్‌ అవుతున్నాయని, ఇలా పార్లమెంటరీ ప్రజస్వామ్యంలో జరగరాదని, సభకార్యకాలాపాల్లో పాల్గొనడం, ప్రశ్నోతరాల సమయం, జీరో అవర్‌లో కీలక అంశాలను లేవనెత్తడం,వాటిపై చర్చించడం ముఖ్యమని, అలాంటి అమూల్యమైన అవకాశాన్ని వృధా చేస్తూ నినాదాలు ఇవ్వడం, సభలను బహిష్కరించడం సభ్యులకు తగదని చంద్ర అన్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘాల పాత్ర గురించీ మాట్లాడారు. వివాదాస్పద అంశాలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఏర్పాటు కోసం ఈ సంఘాలను ఫోరాలుగా వాడుతున్నారన్నారు. కమిటీ సమావేశాలకు సభ్యులు గైర్హాజరు కావడం ఆందోళనకరమని, ఈ చర్చల్లో ఎంపీలు నిష్పాక్షింగా పాల్గొనాలని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషులను అధిగమించిందని సీఈసీ చెప్పారు. పంజాబ్‌లో అది దాదాపు సమానంగా ఉందన్నారు. ఐదు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి పెరిగిందన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే అది 29 పాయింట్లు పెరిగిందని చంద్ర చెప్పారు. భారతీయ ఎన్నికల వ్యవస్థపై సమీక్ష నేపథ్యంలో 1951లో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు దేశంలో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉంటే 45.6శాతం పోలింగ్‌ నమోదు అయిందని గుర్తుచేశారు. 2019 పార్లమెంటరీ ఎన్నికలప్పుడు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఓటింగ్‌లో పాల్గొన్నది అత్యధికంగా 66.4శాతం మంది అని తెలిపారు. ప్రస్తుతం 95.3 కోట్లకుపైగా ఓటర్లు ఉంటే అందులో 49.04 కోట్ల మంది పురుషులు, 46.09 కోట్ల మంది మహిళలు ఉన్నారు’ అని సీఈసీ చంద్ర వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img