Friday, April 19, 2024
Friday, April 19, 2024

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ విడుదల..

డిసెంబర్‌ 7 నుంచి 29 వరకు ఉభయ సభల సమావేశాలు
మొత్తం 17 పని దినాలు ఉంటాయన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
ఈ నెల 21 నుంచి ప్రి బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్‌ విడుదలైంది. డిసెంబర్‌ 7వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడిరచారు. డిసెంబర్‌ 7 నుంచి 29వ తేదీ వరకు ఉభయసభల సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయని చెప్పారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, అంశాలపై చర్చిస్తామన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌ దీప్‌ ధన్‌ కర్‌ ఎగువ సభలో కార్యకలాపాలను నిర్వహించే మొదటి సెషన్‌ ఇది కావడం గమనార్హం.కాగా, పార్లమెంట్‌ సమావేశాల కంటే ముందే ఈ నెల 21వ తేదీన ప్రి బడ్జెట్‌ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ తయారీకి సూచనలు కోరుతూ మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు. పరిశ్రమల చాంబర్లు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగం నిపుణులతో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం అవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img