Friday, April 19, 2024
Friday, April 19, 2024

పిల్లల టీకాలో ఏపీ టాప్‌

రెండు రోజుల్లో 39.8శాతం నమోదు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పిల్లలకు కరోనా టీకాలో ఆంధ్రప్రదేశ్‌ దేశం లోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడిర చారు. దేశవ్యాప్తంగా 15ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సున్న పిల్లలకు టీకా కార్యక్రమాన్ని కేంద్రం ఇటీవల ప్రారంభించింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే 39.8శాతం మంది అర్హులైన పిల్లలు టీకాలు వేయించుకున్నారు. కేంద్రం ఆదేశాలతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం టీకాలు వేయించేందుకు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వైద్యారోగ్యశాఖ యంత్రాంగాన్ని అమ్రత్తం చేసి, కోవాగ్జిన్‌ తొలి డోసును ముమ్మరంగా వేయిస్తోంది. మరో 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. పిల్లల టీకా నమోదు ప్రక్రియ ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైంది. గతంలో పెద్దలు యాప్‌లో నమోదు చేసుకున్న తరహాగానే పిల్లలకూ కోవాగ్జిన్‌ను నమోదు చేస్తున్నారు. వారికి టీకా వేసిన వెంటనే తల్లిదండ్రుల ఫోన్‌ నంబరుకు సమాచారం వస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో తల్లిదండ్రుల అంగీకార పత్రాలను ముందస్తుగా తీసుకుని వాక్సిన్‌ అందజేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు కరోనా టీకా తొలి డోసు అందజేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 39.8 శాతం మందికి అర్హులకు టీకా వేసి, దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. హిమాచల్‌ ప్రదేశ్‌37శాతంతో రెండో స్థానం, గుజరాత్‌30.9శాతంతో మూడో స్థానంలో ఉంది. దాద్రానగర్‌ హవేలి28.3శాతం, కర్ణాటక25.3శాతం, ఉత్తరాఖండ్‌22.5శాతం, మధ్యప్రదేశ్‌20.6శాతం, ఛత్తీస్‌గఢ్‌20.5శాతం చొప్పున 15 నుంచి 18 ఏళ్ల మధ్య అర్హులైన యువతకు ఇప్పటివరకు టీకాలు అందాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img