Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పీఎస్‌బీల్లో 41 వేల పోస్టులు ఖాళీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
న్యూదిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకుల్లో డిసెంబర్‌ 1 నాటికి మంజూరయిన మొత్తం పోస్టులకుగాను 41,177 పోస్టులకు మించి లేదా 5 శాతం ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులు(పీఎస్‌బీలు)లో 8,05,986కు పైగా మంజూరయిన పోస్టులు ఉన్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు సంబంధించి అత్యధికంగా 8,544 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. పీఎస్‌బీల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నందున వారు సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు. పీఎస్‌బీల నుంచి అందిన సమాచారాన్ని మంత్రి ప్రస్తావిస్తూ, ఈ ఏడాది డిసెంబర్‌ 1 నాటికి మంజూరయిన 95 శాతం మంది సిబ్బంది మంజూరయిన సిబ్బందికి భిన్నంగా ఉన్నారని చెప్పారు. పదవీ విరమణ, ఇతర కారణాల వల్ల ఖాళీలు గణనీయంగా ఉన్నాయని ఆమె అన్నారు. ‘డిసెంబర్‌ 1, 2021 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8,05,986 పోస్టులు మంజూరు కాగా, 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని ఒక లిఖితపూర్వక సమాధానంలో సీతారామన్‌ తెలిపారు. ఈ పోస్టులు 12 పీఎస్‌బీల్లో ఆఫీసర్‌, క్లర్క్‌, సబ్‌ స్టాఫ్‌ అనే మూడు విభాగాలుగా విస్తరించి ఉన్నాయి. ఎస్‌బీఐలో 8,544 పోస్టులు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 6,743, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 6,295, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో 5,112, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 4,848 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌బీఐలో 3,423 ఆఫీసర్‌ పోస్టులు, క్లర్క్‌ స్థాయిలో 5,121 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీతారామన్‌ మాట్లాడుతూ 2016లో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకులో ఒక పోస్టు మినహా పీఎస్‌బీల్లో గత ఆరేళ్ల కాలంలో ఏ పోస్టును, ఖాళీని రద్దు చేయలేదని తెలిపారు. బ్యాంకులు వారి అవసరాలకు అనుగుణంగా కొనసాగుతున్న ప్రాతిపదికన ఖాళీల భర్తీకి సిబ్బంది నియామకాన్ని చేపట్టాయని అన్నారు. ఇతర పీఎస్‌బీలుగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img