Friday, April 19, 2024
Friday, April 19, 2024

పెగాసస్‌పై దర్యాప్తునకు త్రిసభ్య కమిటీ

పెగాసస్‌ పుట్టుపూర్వోత్తరాలు

నియమించిన సుప్రీంకోర్టు
మాజీ న్యాయమూర్తికి పర్యవేక్షణ బాధ్యతల అప్పగింత


జులై 18 : ఇజ్రాయిల్‌కు చెందిన మిలటరీ గ్రేడ్‌ స్పైవేర్‌ ద్వారా భారత్‌తో సహా ప్రపంచ దేశాల జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నేతలపై నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థలు
నివేదించాయి.
జులై 22 : వార్తా నివేదికలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) ద్వారా కోర్టు పర్యవేక్షణలో విచారణను కోరుతూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ సుప్రీంను ఆశ్రయించారు.
జులై 27 : ఈ వ్యవహారంలో స్వతంత్ర విచారణను కోరుతూ జర్నలిస్టులు ఎన్‌ రామ్‌, శశికుమార్‌ సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు.
ఆగస్టు 5 : సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది.
ఆగస్టు 16 : నామమాత్రపు అఫిడవిట్‌ను కేంద్రం దాఖలు చేసింది. మీడియా నివేదికలు ఊహాజనితమని తోసిపుచ్చింది.
ఆగస్టు 17 : పెగాసస్‌ వ్యవహారంలో వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసును సుప్రీంకోర్టు జారీచేసింది.
సెప్టెంబరు 13 : తన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో పెట్టింది.
అక్టోబరు 27 : సైబర్‌ నిపుణులతో విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్‌కు అప్పగించింది.

న్యూదిల్లీ : ఇజ్రాయిల్‌ స్పైవేర్‌ సంస్థ పెగాసస్‌పై దర్యాప్తునకు ముగ్గురు సైబర్‌ నిపుణులతో స్వతంత్ర కమిటీని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితుల విచారణకు స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్న కేంద్రప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చింది. న్యాయం చేస్తామని కాదు అది జరిగేలా చూడాలని పేర్కొంది. పెగాసస్‌ కేసులో కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారించింది. ఆరోపణల్లో సాంకేతికత దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను పరిరక్షిస్తుంది. సాంకేతికతను గోప్యత, ఇతర ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వాడరాదని స్పష్టంచేసింది. అదే జరిగితే జీవితం, స్వేచ్ఛ దృష్ట్యా గోప్యత హక్కును జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ముఖ్యమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. న్యాయస్థానం ఎన్నిసార్లు సమాధానాలు కోరినా కేంద్రప్రభుత్వం సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయలేదన్నారు. ప్రాథమిక కేసును దృష్టిలో ఉంచుకుని ఆరోపణలను పరిశీలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. నిజానిజాలు బయటకు వచ్చేలా కోర్టు ప్రత్యేక కమిటీని వేస్తోందని, ఇందులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్‌, ఐపీఎస్‌ అలోక్‌ జోషి, సందీప్‌ ఒబెరాయ్‌ సభ్యులుగా ఉంటారని వెల్లడిరచింది. సైబర్‌ భద్రత, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, నెట్వర్క్స్‌, హార్డ్‌వేర్‌ల త్రిసభ్య ప్యానల్‌ పనితీరును జస్టిస్‌ రవీంద్రన్‌ పర్యవేక్షిస్తారని అత్యున్నత న్యాయస్థానం వెల్లడిరచింది. ఐపీఎస్‌ మాజీ అధికారి అలోక్‌ జోషి, సబ్‌ కమిటీ చైర్మన్‌ సుదీప్‌ ఓబెరాయ్‌లు జస్టిస్‌ రవీంద్రన్‌తో కలిసి పనిచేస్తారని తెలిపింది. కాగా, టెక్నికల్‌ కమిటీలో డాక్టర్‌ నవీన్‌ కుమార్‌ చౌదరి, ప్రొఫెసర్‌ (సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌) నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌, గాంధీనగర్‌, గుజరాత్‌ డీన్‌Ñ డాక్టర్‌ ప్రభాహరన్‌ పి., ప్రొఫెసర్‌ (స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌), అమృత విశ్వ విద్యాపీఠం, అమృతపురి, కేరళÑ డాక్టర్‌ అశ్విన్‌ అనిల్‌ గుమాస్తే, ఇనిస్టిట్యూట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ముంబై, మహారాష్ట్ర ఉన్నారు. నవీన్‌ కుమార్‌ చౌదరి విద్యావేత్త, సైబర్‌ భద్రతా నిపుణులు, ప్రొఫెసర్‌ ప్రభాహరన్‌కు కంప్యూటర్‌ సైన్స్‌, భద్రతా రంగాల్లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇక మూడవ సభ్యుడు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గుమాస్తే అయితే 20 యూఎస్‌ పేటెంట్‌లను మంజూరు చేశారు. 150కుపైగా పత్రాలు, మూడు పుస్తకాలను ప్రచురించారు. అనేక జాతీయ పురస్కారాలను అందుకున్నారు. విక్రమ్‌ సారాభాయి రీసెర్చ్‌ అవార్డును 2012లో పొందారు. శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ప్రైజ్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (2018)నూ అందుకున్నారు. అమెరికాలోని మాంచెస్టర్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విజిటింగ్‌ సైంటిస్ట్‌గానూ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img