Friday, April 19, 2024
Friday, April 19, 2024

పెద్ద పులి బతికే ఉంది

. వేలుపిళ్లై ప్రభాకరన్‌ ప్రజల ముందుకు వస్తారు
. ఎల్టీటీఈ ఆవిర్భావానికి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు
. తమిళ జాతీయోద్యమ నాయకుడు పజా నెడుమారన్‌

తంజావూరు: శ్రీలంకలో ఈలం తమిళుల నాయకుడు (ఎల్‌టీటీఈ చీఫ్‌) వేలుపిళ్లై ప్రభాకరన్‌ బతికే ఉన్నారని, సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని తమిళ జాతీయోద్యమ నాయకుడు పజా నెడుమారన్‌ సోమవారం తెలిపారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ప్రకటన ‘నిజమైన ప్రకటన’ అని పేర్కొంటూ, వేలుపిళ్లై ప్రభా కరన్‌ ఇప్పుడు కనిపించడానికి అనుకూలమైన వాతా వరణం నెలకొని ఉందని తెలిపారు. అంతర్జాతీయ (రాజకీయ) వాతావరణం, శ్రీలంకలోని సింహళీ యులు రాజపక్సేపై తీవ్ర వ్యతిరేకత తమిళుల ఈలం నాయకుడు ప్రభాకరన్‌ ప్రజల ముందుకు రావడానికి సరైన పరిస్థితులను సృష్టించిందని అన్నారు. ప్రభాకరన్‌ ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబం ప్రభాకరన్‌కు అందుబాటులో ఉందని అన్నారు. అయితే, ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని తాను ఇప్పుడే వెల్లడిరచలేనని తెలిపారు. తాను ఈ ప్రకటన ప్రభాకరన్‌ కుటుంబ సభ్యుల అనుమతితోనే చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రక టనతో అతనిపై వ్యాపించిన ‘ప్రణాళిక’ అనుమానా లకు తెరపడుతుందని నెడుమారన్‌ అన్నారు. శ్రీలంకలోని ఈలం తమిళుల ఆవిర్భావానికి ప్రభాకరన్‌ త్వరలో ఒక ప్రణాళికను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శ్రీలంకలోని తమిళులు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న తమిళులు కలిసి నిలబడాలని, తమ పూర్తి మద్దతును తనకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) శక్తివంతంగా ఉన్నంత వరకు, శ్రీలంకలో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో భారత్‌కు విద్వేషపూరితమైన శక్తులు ఏవీ పట్టుసాధించేందుకు అనుమతించలేదని ఆయన అన్నారు. వారు అటువంటి శక్తులను వ్యతిరేకించడమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాల నుంచి ఎటువంటి మద్దతును పొందలేదని తెలిపారు. 2009లో శ్రీలంక ఆర్మీకి, ఎల్టీటీఈకి మధ్య జరిగిన యుద్ధంలో ప్రభాకరన్‌ హతమైన విషయం గుర్తుండే ఉంటుంది. తమిళంలో ‘ఈలం’ అనేది తమిళ ప్రజల మాతృభూమిని సూచిస్తుంది. నెడుమారన్‌ వ్యాఖ్యలపై శ్రీలంక మాజీ ఎంపీ శివాజిలింగమ్‌ స్పందించారు. అప్పుడు ప్రభాకరన్‌ మరణించాడని లంక ప్రభుత్వం చూపించిన మృతదేహం నిజంగా ప్రభాకరన్‌దే అని ఇప్పటికీ నిరూపించలేదని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img