Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పెరిగిన నిరుద్యోగం

దేశం మొత్తం మీద జూన్‌లో 7.80 శాతానికి పెరుగుదల
8.03 శాతానికి ఎగబాకిన గ్రామీణ నిరుద్యోగం

న్యూదిల్లీ: భారతదేశం మొత్తం నిరుద్యోగిత రేటు మేలో 7.12 శాతం నుంచి జూన్‌లో 7.80 శాతానికి పెరిగింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) నుంచి వచ్చిన గణాంకాల ప్రకారం, నిరుద్యోగిత రేటు పెరగడానికి ప్రధానంగా గ్రామీణ నిరుద్యోగం పెరుగుదల కారణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల గరిష్ఠ క్షీణత నమోదయింది. గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగిత రేటు జూన్‌లో 8.03 శాతానికి పెరిగింది. ఇది అంతకు ముందు నెలలో 6.62 శాతంగా ఉంది. ఇది గత నెలలో పట్టణ నిరుద్యోగ రేటు క్షీణతను మేలో 8.21 శాతం నుంచి 7.30 శాతానికి భర్తీ చేసింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, నగరాల్లో ఎక్కువ అవకాశాలు సంవత్సరం ప్రారంభం నుంచి విస్తృత ధోరణిని నొక్కిచెప్పింది. ఈ నెలలో సుమారు 13 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, మిగిలిన వారు శ్రామిక శక్తి నుంచి నిష్క్రమించడంతో నిరుద్యోగుల సంఖ్య కేవలం 3 మిలియన్లు మాత్రమే పెరిగిందని సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ అభిప్రాయపడ్డారు. ఈ సంకోచం, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటును గత రెండు నెలల్లో 40 శాతం నుంచి 38.8 శాతం కనిష్ఠ స్థాయికి తగ్గించిందని ఒక పత్రిక కథనంలో పేర్కొన్నారు. ఉపాధిలో ఈ పదునైన పతనం, ప్రధాన శ్రామిక మార్కెట్‌ నిష్పత్తులలో సమానంగా తీవ్ర క్షీణత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, శ్రామిక మార్కెట్‌ క్షీణత దేశవ్యాప్తంగా విస్తృతంగా లేదని వ్యాస్‌ వివరించారు. వర్షాలు సాధారణం కంటే 32 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇది ‘పొలాల్లోకి కార్మికుల విస్తరణ మందగించవచ్చు’ అని ఆయన అన్నారు. రాబోయే వారాల్లో రుతుపవనాల వేగం పుంజుకోవడంతో కార్మికుల భాగస్వామ్యం మెరుగుపడుతుందని చెప్పారు. వ్యవసాయ రంగం జూన్‌లో దాదాపు 8 మిలియన్ల ఉద్యోగాలను తొలగించింది. ఎక్కువగా తోటలకు అనుసంధానించబడిరది. ఏదేమైనప్పటికీ, పంటల సాగు 4 మిలియన్ల ఉద్యోగాలను జోడిరచింది. ఇది 2020`2021లో ఇదే కాలం కంటే తక్కువగా ఉందని వ్యాస్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img