Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పెరుగుతున్న ఇన్‌ఫ్లూయెంజా కేసులు.. హెచ్‌3ఎన్‌2తో ఆరుగురు మృతి

దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసుల వ్యాప్తి కలవరపెడుతున్నది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించాయని తాజాగా వస్తున్న వార్తలు భయాందోళన రేపుతున్నది. ఇన్‌ఫ్లూయెంజాతో దేశంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో ఒక హెచ్‌3ఎన్‌2 మరణాన్ని అధికారులు ధ్రువీకరించగా.. పంజాబ్‌, హర్యానాల్లో కూడా మరణాలు నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో హెచ్‌3ఎన్‌2 కారణంగా ఈనెల 1న మరణించిన వ్యక్తిని హీరె గౌడ(82)గా అధికారులు గుర్తించారు. మరణాల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇన్‌ఫ్లుయెంజా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలిపింది. పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో తాజాగా 440 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,294కు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img