Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు..కేంద్రం అప్రమత్తం

తెలంగాణ..మరో ఆరు రాష్ట్రాలకు లేఖ
కొవిడ్‌ కేసులు మళ్లీ పలు రాష్ట్రాల్లో పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా ఏడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్‌, టెస్టింగ్‌, కొవిడ్‌ నిబంధనలను పునరుద్ధరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. రాబోయేది పండుగల సీజన్‌ కావడంతో పెద్ద సంఖ్యలో జనం ఒకచోట చోటే అవకాశం ఉంటుందని, ప్రజలుకు కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాలు సాగిస్తుంటారని, ఇందువల్ల కొవిడ్‌ సహా పలు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలుంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్రాలను ఆ లేఖలో హెచ్చరించారు. ఆయన అప్రమత్తం చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక, ఢల్లీి, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. కేసులు పెరుగుదల విషయంలో ఏ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి, పాజిటివిటీ రేటు ఎలా ఉందనే విషయంపై నిఘా ఉంచి, ఇన్‌ఫెక్షన్‌ విస్తరించకుండా క్లస్టర్లు ఏర్పాటు చేయడం, సమర్ధవంతమైన నిర్వహణా చర్యలు చేపట్టడం చేయాలని రాజేష్‌ భూషణ్‌ సూచించారు. ఇన్‌ఫెక్షన్‌ త్వరితగతిని విస్తరించకుండా ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.కర్ణాటలో గత నెల రోజులుగా రోజుకు కనీసం 1,355 కొత్త కేసులు నమోదవుతున్నాయని, ఆగస్టు 5న అత్యధికంగా 1,992 కేసులు నమోదయ్యాయని కర్ణాటక ప్రిన్సిపల్‌ సెక్రటరీ (హెల్త్‌) టీకే అనిల్‌ కుమార్‌కు రాసిన లేఖలో భూషణ్‌ తెలిపారు. రాష్ట్రాలన్నీ ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సినేట్‌-కోవిడ్‌ అప్రాప్రియేట్‌ బిహేవియర్‌ను కచ్చితంగా పాటించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img