Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరం

సీఎం జగన్‌

విశాలాంధ్ర`పులివెందుల:
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరమని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌ జిల్లా, పులివెందుల పట్టణం, పెద్దరంగాపురం సమీపంలోని ఏపీకార్ల్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న న్యూటెక్‌ బయో సైన్స్‌ ప్రాజెక్టుకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆహార ఉత్తత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాలని జగన్‌ సూచించారు. రసాయనాలతో కూడిన ఆహారాలను తినడం వల్ల వివిధ రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉందన్నారు. విత్తు నుంచి విక్రయం వరకు ఆర్బీకేలు అండగా నిలుస్తాయన్నారు. ఇక్కడ శాస్త్రవేత్తల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై గ్రామ స్థాయి నుంచి రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వెల్లడిరచారు. దీని ద్వారా రైతుకు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఆ మేరకు ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుంటామని వివరించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుందన్నారు. శాస్త్రవేత్తలు కూడా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారిస్తారన్నారు. రైతులు కూడా క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలన్నదే తమ ధ్యేయమన్నారు. భూసారం పెరగడం వల్ల రైతులకు ఉత్పత్తి కూడా పెరుగుతందన్నారు. ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తామన్నారు. దాదాపు 10,700 మందిని ప్రొఫెసర్లుగా తీర్చిదిద్ది ప్రతి ఆర్బీకేకు ఒకరు చొప్పున పంపిస్తామని, తద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కలుగుతుందని తెలిపారు. ప్రతి రైతుకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు కల్పించామన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img