Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజాస్వామ్యం ఖూనీ

సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే
దిల్లీలో ప్రతిపక్షాల భారీ నిరసన ర్యాలీ

న్యూదిల్లీ : పెగాసస్‌ గూఢచర్యం, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు, రాజ్యసభలో ఎంపీలపై దౌర్జన్యం వంటి వివిధ అంశాలపై కేంద్రప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు గురువారం పార్లమెంటు నుంచి విజయ్‌ దివస్‌ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీలు ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని ఆపండి’, ‘రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని రాసిన ప్ల కార్డులు, బ్యానర్లను చేతబట్టుకుని కేంద్ర ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లా డుతూ.. ‘ఈరోజు మేం బయటకు వచ్చి మీ (మీడియా)తో మాట్లాడుతున్నాం. ఎందుకంటే పార్ల మెంట్‌లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిపోయాయి. దేశం లోని 60 శాతం మంది ప్రజలు పార్లమెంట్‌ సమా వేశాలు లేవనే అనుకున్నారు. దేశంలోని 60 శాతం మంది ప్రజల గొంతుకలను అణచివేశారు. ఇది ప్రజాస్వామ్య హత్య’ అని మండి పడ్డారు. పెగాసస్‌, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల సమ్ణస్యలను పార్లమెంటులో విపక్షాలు లేవనెత్తినప్పటికీ మోదీ సర్కారు స్పందించలేదని, మాట్లాటానికి తమకు అవకాశమే ఇవ్వలేదని రాహుల్‌ విమర్శించారు. ‘ఈ దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు ఇది ఎంత మాత్రం తక్కువ కాదు’ అని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని పెద్ద వ్యాపారవేత్తలకు అమ్ముతున్నా రని రాహుల్‌ ధ్వజమెత్తారు. ‘‘రాజ్యసభలో మొదటిసారిగా ఎంపీలను కొట్టారు.. ఇందుకోసం బయటి నుంచి వ్యక్తు లను తీసుకువచ్చారు’’ అని రాహుల్‌ ఆరోపించారు. సభను నడపడం చైర్మన్‌, స్పీకర్‌ బాధ్యతని ఆయన గుర్తు చేశారు. ‘‘సభలో విపక్షాలను ఎవరు ఆపుతున్నారు? ఈ దేశాన్ని విక్రయించే పనిని భారత ప్రధాని చేస్తున్నారని నేను మీకు చెప్తాను. అతను భారతదేశ ఆత్మను ఇద్దరు-ముగ్గురు పారిశ్రామికవేత్తలకు విక్రయిస్తున్నాడు.. అందుకే ప్రతిపక్షాలను పార్లమెంటు లోపల మాట్లాడనివ్వలేదు’’ అని గాంధీ నిప్పులు చెరిగారు. శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలకు అనుమతించలేదన్నారు. ‘‘రాజ్యసభలో బయట వ్యక్తులను మార్షల్స్‌గా మోహరిం చారు. నాకు మార్షల్‌ చట్టం విధించినట్లు అనిపించింది.. నేను పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద నిలబడ్డానేమో అనిపిం చింది.. నేను లోపలికి వెళ్లకుండా ఆగిపోయాను’’ అని రౌత్‌ అన్నారు. బుధవారం మహిళా ఎంపీలపై వ్యవహ రించిన తీరు.. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలకు పైగా తన పార్లమెంట్‌ చరిత్రలో ఇలాంటి ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదని తిరుచి శివ అన్నారు. ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ..తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్లమెంటులో ఇలాంటి సిగ్గుమాలిన సంఘటనలను ఎన్నడూ చూడలేదని తమ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, మార్షల్స్‌ తమ ఎంపీలపై అసభ్యంగా ప్రవర్తించారనే విపక్షాల ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి సీసీ టీవీ ఫుటేజ్‌ నుంచి వాస్తవాలను తనిఖీ చేయవచ్చునని చెప్పారు.
రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు
తొలుత రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు సమావేశమ య్యారు. వీరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, తిరుచ్చి శివ, మనోజ్‌ రaా, ఇతర ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వీరంతా రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడిని కలిసి సభలో కొంతమంది మహిళా ఎంపీలు సహా తమ ఎంపీలను అధికార పక్ష సభ్యులు ఎగతాళి చేస్తున్నారని, మార్షల్స్‌ ముసుగులో సభ్యులపై దౌర్జన్యం జరిగిందని ఫిర్యాదు చేశారు. కొంతమంది కేంద్రమం త్రులు సైతం బుధవారం రాజ్యసభ చైర్మన్‌ను కలిసి కొంతమంది ప్రతిపక్ష సభ్యులు వికృతంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. కొంతమంది మహిళా ఎంపీలతో సహా విపక్ష నాయకులపై దౌర్జన్యం జరిగిందన్న ఆరోపణల మధ్య రాజ్యసభలో కీలక బిల్లులు ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img