Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రధాని అభ్యర్థి..నరేంద్రమోదీనే

జేడీయూ జనరల్‌ సెక్రెటరీ కేసీ త్యాగి
వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా కూడా నరేంద్రమోదీనే ఉంటారని జేడీయూ జనరల్‌ సెక్రెటరీ కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. ఇవాళ పట్నాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి తరపున ప్రస్తుతం నరేంద్రమోదీనే ప్రధానిగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా కూడా ఆయనే ఉంటారని ఆయన అన్నారు. కాగా ఆదివారం మీడియాతో మాట్లాడిన కేసీ త్యాగి.. నితీశ్‌ కుమార్‌ ప్రధాని పదవికి అన్ని విధాలుగా తగిన వ్యక్తని చెప్పారు. ఆయనకు 16 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. దేశంలో అందరికీ నితీష్‌కుమార్‌ పనితీరు తెలుసని, అయితే ప్రస్తుతం ప్రధాని పదవి ఖాళీగా లేదని త్యాగి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img