Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రధాని లక్ష్యంగా గణతంత్ర దినోత్సవాన దాడులకు ఉగ్ర కుట్ర..

అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్‌..
ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోది సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని భారీ కుట్ర పన్నినటు ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి కీలక సమాచారాన్ని అందజేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిరచాయి. 9 పేజీల ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్లో ఉగ్రవాద కుట్ర గురించి నిఘా ఏజెన్సీల హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్‌, కిర్గిజ్‌స్తాన్‌, తజికిస్తాన్‌, తుర్క్మెనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ విధ్వంసం సృష్టించాలని, తద్వారా భారత ప్రతిష్టను దెబ్బ తీయాలని పథక రచన చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.పాకిస్థాన్‌/ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్‌ నోట్‌ వెల్లడిరచింది. ఈ ఉగ్రవాద సమూహాలు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, బహిరంగ సభలు, కీలకమైన సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా పథక రచన చేశాయని ఇంటలిజెన్స్‌ నివేదిక వెల్లడిరచింది. డ్రోన్‌లను ఉపయోగించి కూడా దాడులకు ప్రయత్నించవచ్చని నిఘావర్గాల హెచ్చరికలు జారీ చేశాయి.లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌, జైషే మహ్మద్‌, హర్కత్‌ ఉల్‌ ముజాహిదీన్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి టెర్రరిస్ట్‌ గ్రూపులు ఈ ఉగ్ర ముప్పు వెనుక ఉన్నట్టు వెల్లడిరచింది. పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు, పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు, పునరుజ్జీవింపజేసేందుకు క్యాడర్‌లను కూడా సమీకరించుకుంటున్నాయని నిఘా వర్గాల ఇన్‌పుట్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img