Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రధాన యుద్ధనౌకల్లో మహిళా అధికారుల నియామకం

న్యూదిల్లీ : భారత నావికాదళానికి చెందిన ప్రధాన యుద్ధనౌకల్లో మహిళా అధికారులను నియమించినట్లు నావల్‌ స్టాఫ్‌ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ శుక్రవారం తెలిపారు. భారత నావికాదళానికి చెందిన 15 ప్రధాన యుద్ధనౌకల్లో ఇప్పటి వరకు 28 మంది మహిళా అధికారులను నియమించామని, త్వరలోనే ఈ సంఖ్య పెరుగుతుందని కూడా వెల్లడిరచారు. నౌకాదళ దినోత్సవానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో అడ్మిరల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నావికాదళంలోని వివిధ బాధ్యతల్లో మహిళలను విస్తృత స్థాయిలో నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘మహిళల సాధికారతలో భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, నేవీలో మహిళా అధికారులకు అదనపు అవకాశాలను కల్పించే దిశగా మేము చర్యలు తీసుకున్నాము. దాదాపు అన్ని ప్రధాన యుద్ధనౌకలలో మహిళా అధికారులను నియమించారు’ అని ఆయన చెప్పారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో క్యాడెట్‌ ఎంట్రీగా మహిళలకు శిక్షణనిచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు నేవీ చీఫ్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img