Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రభుత్వమే కారణం

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై సర్కార్‌కు గౌరవం లేదు

బయటి వ్యక్తులొచ్చి ఎంపీలపై దౌర్జన్యం చేశారు
మోదీ సర్కారుబుకాయిస్తోంది
పెగాసస్‌, సాగు చట్టాలపై చర్చించే ధైర్యం ప్రభుత్వానికి లేదు
11 ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ సర్కారు ఉద్దేశపూర్వకం గానే పార్లమెంటును సజావుగా సాగనీయకుండా చేసిందని 11 ప్రతిపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు. మహిళా సభ్యులు సహా ప్రతిపక్ష ఎంపీలపై పార్లమెంటు భద్రతలో భాగం కాని వ్యక్తులతో దౌర్జన్యం చేయించారని తెలిపారు. ఈ మేరకు గురువారం ఉమ్మడి ప్రకటనలో పేర్కొ న్నారు. కేంద్రప్రభుత్వ నిరంకుశ వైఖరి, అప్రజాస్వా మిక చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిర చాయి. బుధవారం రాజ్యసభలో జరిగిన సంఘటన దిగ్భ్రాంతికరం.. సభ గౌరవాన్ని మంటగలిపారని, సభ్యులను అవమానించారని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పెగాసస్‌ గూఢచర్యం పై చర్చ జరపకుండా ప్రభుత్వం పారిపోయింద న్నారు. అంతకు ముందు ప్రతిపక్ష పార్టీల నాయ కులు పార్లమెంటులో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, శివసేన, ఎస్‌పీ, డీఎంకే,సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, ఆర్‌ఎస్పీ, కేరళ కాంగ్రెస్‌ (ఎం) నాయకులు సమావేశంలో పాల్గొ న్నారు. టీఎంసీ, ఆప్‌, బీఎస్పీ పాల్గొనలేదు. ‘నిన్న రాజ్య సభలో జరిగినది దిగ్భ్రాంతికరం.. అసాధారణం.. సభా గౌరవానికి, సభ్యులకు అవమానకరం’ అని ప్రతిపక్ష నాయకులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్షం నుంచి ఎటువంటి రెచ్చగొట్టే చర్య లేకుండానే పార్లమెంటు భద్రతలో ప్రమేయంలేని బయటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రభుత్వ నియంతృవైఖరి, గొంతు నొక్కడాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను, సభ్యులపై దౌర్జన్యం చేయించారని తెలిపారు. ‘‘ప్రభుత్వ నిరంకుశ వైఖరిని మరియు అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగించడానికి, జాతీయ ప్రాముఖ్యత గల ప్రజల సమస్యలపై ఆందోళన చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము’’ అని ఉమ్మడి ప్రకటన పేర్కొంది.
దేశ ఆర్థిక పరిస్థితితో పాటు జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న పెగాసస్‌ గూఢచర్యం, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలు, నిత్యావసరాలు, ఆహార ధాన్యాలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల పెరుగుదల వంటి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న సమస్యలు, అంశాలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి తెలియజేశాయని ప్రతిపక్షనేతలు పేర్కొన్నారు. అయితే చర్చ కోసం ప్రతిపక్షాల డిమాండ్‌ని ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటరీ జవాబుదారీతనంపై నమ్మకం లేదని, పెగాసస్‌పై చర్చ నుంచి పారిపోతోందని స్పష్టమైందని ఫలితంగా ప్రతిష్ఠంభన ఏర్పడిరదని వారు చెప్పారు. ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసిన నాయకులలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌, డీఎంకేకు చెందిన టి.ఆర్‌.బాలు, కాంగ్రెస్‌ ఎంపీలు ఆనంద్‌ శర్మ, అధిర్‌ రంజన్‌ చౌదరి, ఎస్‌పీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, తిరుచ్చి శివ (డీఎంకే), మనోజ్‌ రaా (ఆర్జేడీ), సీపీఐ ఎంపీ బినయ్‌ విశ్వం, సీపీఎం ఎంపీ ఎలమారం కరీం, ఐయూఎంఎల్‌కు చెందిన మహమ్మద్‌ బషీర్‌, ఆర్‌ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమచంద్రన్‌, కేరళ కాంగ్రెస్‌ (ఎం) ఎంపీ థామస్‌ ఖజికడన్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img