Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రియాంకా గాంధీ పిల్లల ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్‌..దర్యాప్తు జరుపుతామన్న కేంద్రం

తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు సైతం హ్యాక్‌ అవుతున్నాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వద్రా ఆరోపించారు. అయితే ఆ కేసును విచారించనున్నట్లు కేంద్రం పరిధిలోని యాంటీ సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ పేర్కొన్నది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. దానిపై ప్రశ్నించిన సమయంలో.. ప్రియాంకా తన పిల్లల ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాకింగ్‌ గురించి తెలిపారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ను వదిలేయండి. నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా కూడా హ్యాక్‌ అయింది.’ అని విలేకరులతో అన్నారు. ఈ ప్రభుత్వానికి వేరే పని లేదా? అని ప్రశ్నించారు. విపక్షాల ఫోన్లను ట్యాప్‌ చేయడమేనా వాళ్ల పని, ప్రజల కోసం వాళ్లు పనిచేయరా అని ప్రియాంకా నిలదీశారు. తమ పిల్లల ఇన్‌స్టా అకౌంట్ల హ్యాక్‌ అయినట్లు ప్రియాంకా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఆ అంశాన్ని దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ లేదా సీఈఆర్టీ.. ఇన్‌స్టా అకౌంట్ల హ్యాక్‌ అంశాన్ని పరిశీలించనున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా వెల్లడైంది. సీఈఆర్టీ-ఇన్‌ ఓ అడ్వాన్స్‌డ్‌ ల్యాబ్‌ను నడిపిస్తుంది. హ్యాకర్లను ఆ ల్యాబ్‌ ట్రేస్‌ చేస్తుంది. సైబర్‌ దాడుల్ని కూడా అది అడ్డుకుంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ దాడులు చేస్తున్నట్లు ప్రియాంకా ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img