Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్లాస్టిక్‌ జాతీయ జెండాలు వద్దు

: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్లాస్టిక్‌తో తయారుచేసిన జాతీయజెండాలను వాడొద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు ఈ విధానాలు అమలయ్యేలా చూడాలని సూచించింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌తో కాకుండా కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలనే వినియోగించాలని పేర్కొంది. ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా-2002 ప్రకారం కాగితంతో తయారు చేసిన జెండాలు వాడుతారనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది.కాగితపు జాతీయ జెండాలను వినియోగించిన తర్వాత ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని, పూర్తి గౌరవంతో డిస్పోజ్‌ చేయాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img