Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బండ బాదుడు…


పెరిగిన వాణిజ్య సిలిండర్‌ ధర

దీపావళికి ముందు దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరోసారి పెంచాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.268 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. దేశ రాజధాని ఢల్లీిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.264 పెరిగింది. తాజా పెంపుతో వాణిజ్య సిలిండర్‌ ధర దేశ రాజధాని ఢల్లీిలో రూ.2000 మార్క్‌ను దాటడం గమనార్హం. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. అయితే సామాన్యులకు ఉపయోగపడే 14.2 కిలోల నాన్‌ సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పెంచలేదు. దీని ధరలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో ధర రూ.2133కు చేరింది. ఇప్పటికే ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరగా.. గ్యాస్‌ ధరలు సైతం చుక్కలనంటుతుండడంతో దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ప్రతి నెల ఒకటి, 15వ తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img