Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బడ్జెట్‌ 2022-23ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్‌ను ఆమె సమర్పించారు. వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్నారు. అయితే పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర మంత్రివర్గం సమర్పించే బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈసారి కూడా నిర్మలమ్మ.. ఎర్రటి బ్యాగులో బడ్జెట్‌ను తీసుకొచ్చారు.
ఆ నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి
మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగానికి అధికార బీజేపీ పక్ష ఎంపీల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్‌, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులు- ఈ నాలుగు అంశాలపై ఈ బడ్జెట్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ లోక్‌సభలో చెప్పినపుడు బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ తమ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. 25,000 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించగానే సభ్యులు చప్పట్లు చరిచారు. కొత్తగా 400 వందే భారత్‌ రైళ్ళను ప్రారంభిస్తామని మంత్రి చెప్పినపుడు కూడా సభ్యులు బల్లలు చరిచారు.
రానున్న 25ఏళ్ళ అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది..
వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్‌ పునాది పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది కానుందని పేర్కొన్నారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందన్నారు. గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ పరుగు ఆరంభం అయిందని చెప్పారు. . వచ్చే 25 ‘సంవత్సరాల్లో భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా చెప్పారు. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ చాలా ఉపయోగ పడిరదని ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకాలు కీలకపాత్ర పోషించాయని పేర్కొన్నారు.
2021-22లో ఆర్థికంగా కోలుకున్నాం..

ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వం బదలాయించిందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు త్వరలోనే ఎల్‌ఐసీ ఐపీఓను తీసుకొస్తామన్నారు. 2021-22లో ఆర్థికంగా కోలుకున్నామన్నారు. ఈ బడ్జెట్‌ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img