Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బలమైన ప్రభుత్వం..వారిపై బలమైన చర్యలు తీసుకోవాలి : వరుణ్‌ గాంధీ

బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్న వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘విజయ్‌ మాల్యా 9000 కోట్లు, నీరవ్‌ మోదీ 14000 కోట్లు, రుషి అగర్వాల్‌ 23000 కోట్లు నేడు అప్పుల బాధతో రోజుకు దేశంలో 14 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోట్లకు కోట్లు పడగలెత్తిన వీరి జీవితాలు మాత్రం శోభాయమానంతో తెగ వెలిగిపోతున్నాయి. ఇంతటి బలమైన ప్రభుత్వం.. వీరిపై బలమైన చర్యలు తీసుకోవాలన్నది మా భావన’ అని విమర్శించారు. అలాగే నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన రైతుల పట్ల కేంద్రం సరైన విధంగా స్పందించలేదని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img