Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బాండ్ల పేరుతో దోపిడీ

నాలుగు నెలల్లో రూ. లక్ష కోట్లపైనే ఆదాయం
మంత్రుల ప్రకటనలు బూటకమని తేల్చిన ప్రభుత్వ లెక్కలు

న్యూదిల్లీ : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయిల్‌ బాండ్ల పేరుతో ప్రజలపై భారం మోపుతూ ఖజానా నింపుకుంటున్నదన్న విషయాన్ని ప్రభుత్వ లెక్కలే బహిర్గతం చేశాయి. ఈ విషయమై మంత్రులు చేస్తున్న ప్రకటనలు ఒట్టి బూటకంగా తేల్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో పెట్రో ఉత్పత్తుల (పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌, సహజ వాయువు)పై వసూలైన ఎక్సైజ్‌ సుంకం మొత్తం గతేడాదితో పోలిస్తే 48 శాతం పెరిగింది. ఒక్క పెరిగిన ఆదాయం లెక్క తీసుకున్నా ఈ ఏడాది చెల్లించాల్సిన ఆయిల్‌ బాండ్ల మొత్తం కంటే మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖకే చెందిన కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) డేటా ద్వారా ఈ విషయం స్పష్టమైంది. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ చేసిన ప్రకటనలు శుద్ధ అబద్దంగా సీజీఏ గణాంకాలు తేల్చాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నుంచి ఊరట కల్పించడంపై నిర్మలా సీతారామన్‌ ఇటీవల వ్యాఖ్యానిస్తూ, ‘‘యూపీఏ ప్రభుత్వ హయాంలో రాయితీపై ఇంధనం సరఫరా చేయడానికి ప్రభుత్వరంగ రిటైలర్లకు రూ.1.34 లక్షల కోట్ల చమురు బాండ్లను జారీ చేశారు. దీనిపై ఏడేళ్లుగా మా ప్రభుత్వం రూ.70,196 కోట్లు వడ్డీ చెల్లించింది. అసలు కింద రూ.3,500 కోట్లే చెల్లించాం. మిగిలిన మొత్తాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోగా చెల్లించాలనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ సుంకం తగ్గించే అవకాశం లేదు’’ అని అన్నారు. ఆ తరువాత కొద్దిరోజులకు హర్దీప్‌ సింగ్‌ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. అయితే, పెట్రో ఉత్పత్తులపై ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్‌- జులై మధ్య రూ.లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రాబడి వచ్చినట్లు సీజీఏ డేటా పేర్కొంది. గతేడాది ఇదే నాలుగు నెలల కాలానికి రూ.67,895 కోట్లు సమకూరింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ సారి వసూలైన మొత్తం రూ.32,492 కోట్లు అదనం. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆయిల్‌ బాండ్లకు గానూ కేంద్రం చెల్లించాల్సింది రూ.10వేల కోట్లు. అంటే ఆయిల్‌ బాండ్లకు చెల్లించాల్సిన మొత్తం కంటే కేవలం నాలుగు నెలల్లో అదనంగా సమకూరిన మొత్తమే మూడు రెట్లు అధికం. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌, సహజ వాయువుపై ఎక్సైజ్‌ సుంకం విధించారు. 202122 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఇంక్రిమెంటల్‌ వసూళ్లు రూ.32,492 కోట్లకు పెరిగింది. యూపీఏ హయాంలో జారీ అయిన సబ్సిడీ చమురు బాండ్ల చెల్లింపుల దిశగా ఏడాది మొత్తం ప్రభుత్వ లయబిలిటీ రూ.10వేల కోట్ల కంటే మూడు రెట్లు అధికంగా ఇది ఉంది. మొత్తంగా యూపీఏ ప్రభుత్వం రూ.1.34లక్ష కోట్ల విలువ చేసే బాండ్లను జారీచేసింది. వీటిలో రూ.10వేల కోట్ల అప్పు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉందని ఆర్థిక శాఖ తెలిపింది. ఇంధనం ధరలు రికార్డు స్థాయికి పెరగడానికి ఈ బాండ్లే కారణమని తొలుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆపై చమురు మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ నిందించే ప్రయత్నం చేశారు. వంట గ్యాస్‌ ధర పెంపుదల నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తగా మొత్తం లయబిలిటీ రూ.1.5లక్షల కోట్లకుపైగా ఉన్నట్లు పూరి పేర్కొన్నారు. పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటరుపై రూ.19.98 నుంచి రూ.32.9కు పెరిగింది. 202122 ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2023`24లో మరో రూ.31,150 కోట్లుÑ తదుపరి సంవత్సరం రూ.52,850.17 కోట్లు చెల్లించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img