Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బాధ్యత మరింత పెరిగింది

పరిషత్‌ ఫలితాలపై సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలిచ్చిన అఖండ విజయం ప్రభుత్వంపైనా, నాపైనా మరింత బాధ్యతను పెంచాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై సోమ వారం సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ ప్రసంగం చేశారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 151 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 గెల్చుకోవడంతోపాటు దాదాపు 50 శాతం పైచిలుకు ఓట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, మొత్తం 13,081 పంచాయతీలకుగాను 10,536 గెల్చుకున్నామని, అంటే సుమారు 81 శాతం పంచాయతీలలో పార్టీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. వీటి తర్వాత నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికలలో ఏకంగా 75కు 74 చోట్ల వైసీపీ స్వీప్‌ చేసిందని అన్నారు. ఇక 12 మున్సి పల్‌ కార్పొరేషన్లకుగాను 12కు 12 గెల్చుకుని 100 శాతంతో సరికొత్త రికార్డు నెలకొల్పామని అన్నారు. తాజాగా నిర్వహించిన పరిషత్‌ ఎన్నికలలో 9,583 ఎంపీటీసీలకుగాను 8,249 (86 శాతం), 638 జెడ్పీటీసీలకుగాను 628 జడ్పీటీసీలు (98 శాతం) గెల్చుకున్నామని వివరించారు. దీనికి కారణం ఈ రెండున్నర ఏళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో, చేసిన హామీల్లో 95 శాతానికి పైగా అమలు చేయగలగడమేనన్నారు. ఎన్నికలు జరగకుండా వాయిదా వేయించాలని, ప్రభుత్వానికి అనేక అవరోధాలు, ఇబ్బందులు కల్పిస్తూ రకరకాల శక్తులు ప్రయత్నాలు చేశాయని, అయినప్పటికీ ప్రజలందరి దీవెనల వల్ల వాటిని సునాయాసంగా ఎదుర్కోగలిగామన్నారు. మీరు మాపై ఉంచిన నమ్మకానికి భవిష్యత్తులో మరింత కష్టపడతామని సీఎం హామీ ఇస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు తదితరులు ముఖ్యమంత్రిని దుశ్శాలువతో సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img