Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బారికేడ్లు దాటుకొని ముందుకు …

దేశద్రోహుల కేసులు ఉపసంహరించాలి
హరియాణా రైతుల డిమాండు : సిర్సాలో భారీ ఆందోళన
అడ్డుకున్న పోలీసులు, పారామిలటరీ బలగాలు ` అరెస్టులు

కొత్త సాగు చట్టాల రద్దు డిమాండుతో ఆందోళనలు చేసే క్రమంలో హరియాణాలో బీజేపీ కార్యక్రమాలను అడ్డుకుంటున్న రైతులపై దేశద్రోహం కేసులు నమోదు అయ్యాయి. ఇందుకు నిరసనగా అన్నదాతలు శనివారం భారీ ఆందోళనకు దిగారు. తమ సహచరులపై పెట్టిన దేశద్రోహం కేసులను ఉపసంహరించాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండు చేశారు. పారా మిలిటరీ బలగాలు మోహరించి ఉన్నాగానీ రైతులు వెనక్కి తగ్గలేదు. అడ్డువచ్చిన బ్యారికేడ్లను ధ్వంసం చేశారు. దిల్లీ నుంచి 250కిమీల దూరంలో ఉన్న సిర్సా ఉదయం నుంచి హైఅలర్ట్‌లో ఉంది. బ్యారికేడ్లను తోసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా, తమ ఇతర డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించేందుకు 20 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మధ్యాహ్నం అధికారులతో భేటీ అయింది. ఈనెల 11న డిప్యూటీ స్పీకర్‌ రణదీప్‌ గంగ్వా కారుపై దాడి కేసులో ఐదుగురు రైతులను అరెస్టు చేశారు. 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. వీటిని సంయుక్త కిసాన్‌ మోర్చా ఓ ప్రకటనలో ఖండిరచిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img