Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బిగ్‌ బాస్‌ షో..ఒక సాంఘిక దురాచారం.. : సీపీఐ నారాయణ

సినీ నటుడు నాగార్జున హోస్ట్‌ చేస్తున్న బిగ్‌ బాస్‌ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్‌ బాస్‌ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని… తెలంగాణ హైకోర్టు తన పిటిషన్‌ను స్వీకరించలేదని తెలిపారు. అయితే ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని… ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక బిగ్‌ బాస్‌ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ దీనిని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్‌ ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img