Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీపై అనర్హత వేటు

న్యూదిల్లీ : బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీపై అనర్హత వేటుపడిరది. అపహరణ`హత్య కేసులో అన్సారీకి నాలుగేళ్ల జైలుశిక్షను ఉత్తరప్రదేశ్‌ కోర్టు విధించిన నేపథ్యంలో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈయన సోదరుడు, రాజకీయ నాయకుడిగా మారిన నేరస్తుడు ముక్తార్‌ అన్సారీకి ఇదే కేసులో పదేళ్ల శిక్ష పడిరది. ఘాజీపూర్‌కు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించే అఫ్జల్‌ అన్సారీతో పాటు ఆయన సోదరుడు స్థానిక ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో దోషులుగా తేలారు. 2005, నవంబరు 29న రాయ్‌ హత్యతో పాటు 1997లో వారణాసి వర్తకుడు నంద్‌ కిశోర్‌ రుంగ్తా అపహరణ, హత్యను కలిపి ఇద్దరిపై యూపీ గ్యాంగ్‌స్టర్స్‌ చట్టం కింద కేసుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం
వహించే అఫ్జల్‌ అన్సారీ 2023, ఏప్రిల్‌ 29వ తేదీ నుంచి తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారని లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ పేర్కొంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఇటీవల అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img