Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీలో అంతర్గత విభేదాలు

. హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటమికి అదే కారణమన్న ‘ఆర్గనైజర్‌’
. ప్రధాని మోదీ చరిష్మా పనిచేయలేదని వెల్లడి
. చాలా రాష్ట్రాల్లో పరిస్థితిపై కాషాయదళం ఆందోళన

. రాష్ట్ర జీడీపీలో 36.5 శాతం పెరుగుదల
. పార్లమెంటులో కేంద్రం వెల్లడి

న్యూదిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో గుజరాత్‌లో గెలిచినా, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం అంతర్గత విభేదాల వల్లే ఆ పార్టీ ఓడిపోయిందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో రాబోయే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో ఉంటుందని అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌ పరిస్థితులే అక్కడా ఎదురవుతాయేమోనని కలవరపడుతోంది. వివిధ రాష్ట్రాల్లో అంతర్గత కుమ్ము లాటలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని హిమాచల్‌ప్రదేశ్‌ ఓటమిని ఉటంకిస్తూ సంఫ్‌ు పరివార్‌కు గళంగా భావించే ‘ఆర్గనైజర్‌’ పత్రిక తాజాగా విశ్లేషించింది. త్రిపుర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, దిల్లీ, కేరళలోని పార్టీ వర్గాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు కాషాయ దళాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైతే గెలవడం కష్టమేనని పార్టీ అధినాయకత్వం ఆలోచనలో పడిరదని విశ్లేషకులు చెబుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మోదీ చరిష్మా ఏమాత్రం పని చేయలేదని, అంతర్గత కుమ్ములాటలను మోదీ చరిష్మా అధిగమించలేదని ఇది నిరూపించినట్లు ఆర్గనైజర్‌ పత్రిక తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోనే అంతర్గత కుమ్ములాటలను, అసమ్మతిని అధిగమించలేకపోయారు… ఫలితంగా 20 మంది పార్టీ నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది… అభ్యర్థుల ఎంపిక మరీ పేలవంగా జరగటమే పార్టీ ఓటమికి కారణమని తిరుగుబాటు అభ్యర్థుల్లో ఒకరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిర్పాల్‌ పర్మాల్‌ పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో తారాస్థాయికి…
రాజస్థాన్‌లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరడంతో నడ్డా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రారంభించిన ‘జన్‌ ఆక్రోశ్‌ యాత్ర’ను నడ్డా ఈ నెల 1న ప్రారంభించారు. ఆ సందర్భంగా వసుంధర రాజే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్‌ పూనియా మధ్య విభేదాలను తొలగించే ప్రయత్నం చేశారు. మరోవైపు, అక్కడ సీఎం పదవిని ఆశించే ఆశావహుల సంఖ్య అరడజనుకు చేరింది. ఈ రేసులో వసుంధరరాజే, పూనియా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ ఉన్నారు. జన్‌ ఆక్రోశ్‌ యాత్రలో పాల్గొనే వాహనాలపై తన బొమ్మ ఉంటే తప్ప తాను పాల్గొననని వసుంధర రాజే భీష్మించుకోవడంతో చివరకు ఇతరులను ఒప్పించడానికి నడ్డాకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
గుజరాత్‌లో తక్కువేమీ కాదు
గుజరాత్‌లోనూ బీజేపీ అంతర్గత కుమ్ము లాటలతో సతమతమైంది. అయితే అక్కడ విజయం సాధించడంతో అసమ్మతి పోరు బహిర్గతం కాలేక పోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, బీజేపీతో అనుబంధం ఉన్నవారిని పక్కనపెట్టి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వడం వల్లే గుజరాత్‌లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందని పార్టీ విశ్లేషించుకొంటున్నది. మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ వంటి అగ్రనాయకులను పార్టీ పక్కన పెట్టడమే కాకుండా 40 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించిన విషయం తెలిసిందే.
కర్ణాటకలో కలవరం
బీజేపీ పాలిత కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్‌ పుంజుకోవడం బీజేపీ అధినాయకత్వాన్ని ఆందోళ నకు గురి చేస్తున్నది. మాజీ సీఎం యెడియూ రప్పను రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా పెట్టినట్టే కనిపిస్తోంది. గుజరాత్‌ ఎన్నికల పరిశీలకుడిగా, పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా నియమించి నంత మాత్రాన రాష్ట్ర రాజకీయాల నుంచి తనను దూరం చేయలేరని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత పోరుకు సంకేతంగా, అధిష్ఠానానికి హెచ్చరికలా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img