Friday, April 19, 2024
Friday, April 19, 2024

బీజేపీ అభ్యర్థికి మద్దతా?

జగన్‌పై రామకృష్ణ మండిపాటు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: బీజేపీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ ఏ ప్రాతిపదికన మద్దతిచ్చారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు సాధిస్తామనని ఎన్నికల సమయంలో పదేపదే చెప్పారన్నారు. ఇవాళ జగన్‌కు 31 మంది ఎంపీలున్నారని, గతంలో బీజేపీకి జగన్‌ అవసరం లేదని, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌ మద్దతు కచ్చితంగా బీజేపీకి అవసరమని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ హోదాకు సంబంధించి బీజేపీపై జగన్‌ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. వైసీపీకి 155 మంది ఎమ్మెల్యేలు, 31 మంది ఎంపీలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయినా ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు, కడప స్టీలుప్లాంట్‌ తదితర అంశాలపై కేంద్రంపై కనీసం ఒత్తిడి పెంచలేదని విమర్శించారు. కేంద్రాన్ని అడగకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం బలపరిచిన బీజేపీ అభ్యర్థికి ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. మోదీకి జగన్‌ లొంగిపోతున్నారని విమర్శించారు. జగన్‌ స్వార్థ రాజకీయాల కోసం, ఆయన కేసుల కోసమే మోదీ మెడలు వంచుతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img