Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ

ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రులతో పాటు బీహార్‌, నాగాలాండ్‌ ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలన సంబంధిత విషయాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరును ఈ సమావేశంలో ప్రధాని సమీక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల పురోగతికి సంబంధించి సీఎంలు ప్రజెంటేషన్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.అలాగే, ఈరోజు సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్‌ సంస్థాన్‌ 98వ వార్షికోత్సవ వేడుకలో మోడీ పాల్గొంటారు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం, వారణాసిలోని మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే స్వర్వేద్‌ మహామందిర్‌లో సద్గురు సదాఫల్దీయో విహంగం యోగ్‌ సంస్థాన్‌ 98వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మంగళవారం కూడా కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img