Friday, April 19, 2024
Friday, April 19, 2024

బీజేపీ హఠావో… దేశ్‌ బచావో

ఇదే సీపీఐ నినాదం: డి.రాజా

. నిరంకుశ బీజేపీ రాజకీయ`సైద్ధాంతిక ఓటమే లక్ష్యం
. ఏప్రిల్‌ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు
. సామాజిక రంగాలకు న్యాయమైన కేటాయింపుల కోసం డిమాండ్‌

పుదుచ్చేరి: కేంద్రంలోని బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఏప్రిల్‌ 14 నుంచి మే 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిర్ణయించింది. బీజేపీని ఓడిరచే లక్ష్యంతో రాజకీయ ప్రచారోద్యమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. దుష్పరిపాలన నుంచి దేశాన్ని రక్షించడమే కాకుండా రాజ్యాంగ విలువల పరిరక్షణే తమ అజెండాగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడిరచారు. ‘బీజేపీ హఠావో, దేశ్‌ బచావో’ నినాదంతో తమ ప్రచారోద్యమం సాగనున్నట్లు తెలిపారు. ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుదుచ్చేరిలో జరిగిన జాతీయ సమితి సమావేశాల నిర్ణయాలు, తీర్మానాలను వెల్లడిరచారు. ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విద్య, ఆరోగ్యం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏతో పాటు ఇతర సామాజిక రంగాలకు కేటాయింపులు పెంచాలని, అదానీ గ్రూపు కంపెనీల మోసాలు, అవినీతిపై మాత్రమే కాకుండా అందులో మోదీ ప్రభుత్వ పాత్రపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్‌ చేస్తున్నదన్నారు. దేశంప్రజల భవిష్యత్‌ దృష్ట్యా 2024 సార్వత్రిక ఎన్నికలు కీలకమైనవని, ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీని రాజకీయంగానే కాకుండా సైద్ధాంతికంగానూ ఓడిరచాలని పిలపునిచ్చారు. ఇప్పటికే లౌకిక, ప్రజాస్వామ శక్తులు ఏకం కావాలని సీపీఐ 24వ జాతీయ మహాసభల ద్వారా పిలుపు ఇవ్వడాన్ని ఆయన గుర్తుచేశారు. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతానికి వ్యతిరేకశక్తులన్నీ ఏకం కావడం, ప్రగతిశీల కూటమిగా ఏర్పాటు కావడం ప్రస్తుతం కీలకమని రాజా నొక్కిచెప్పారు. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే ప్రజా సంఘాలను విస్తరించటకు పార్టీ యంత్రాంగం అంతా దృష్టి పెట్టాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో సైద్ధాంతిక అవగాహన పెంచాలని, పార్టీ మరింత సమర్థంగా పనిచేయడానికి అవసరమైన హాల్‌టైమర్ల పెంపుదల కోసం నిధి సేకరించాలని కూడా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సానుభూతిపరులకు రాజా పిలుపునిచ్చారు. ఇదిలావుంటే, ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధమైన కార్యకలాపాలు చేపడుతూ కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా లౌకికప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టాన్ని ఈ తొమ్మిదేళ్లలో కలిగించడాన్ని జాతీయ సమితి ముసాయిదా తీర్మానం తీవ్రంగా ఖండిరచింది. మోదీ పాలనలో దేశంలో వివక్ష పెరిగిందని, మైనారిటీలకు రక్షణ కరువైందని పేర్కొంది. 2023`24 కేంద్ర బడ్జెట్‌నూ విమర్శించింది. ఇది అమృత కాలం అని చెప్పుకునే బీజేపీ… సామాజిక రంగాల కార్యక్రమాలకు బడ్జెట్‌ కేటాయింపులను తగ్గించిందని దుయ్యబట్టింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కేటాయింపుల్లో భారీగా కోత పెట్టిందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపలేదని పేర్కొంది. ఉక్రెయిన్‌`రష్యా సమస్యకు శాంతి పరిష్కారాన్ని సీపీఐ కోరుకుంటోందని, నాటో ద్వారా అమెరికా, యూరోప్‌ దేశాల జోక్యంతో ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, మార్చి 20న ఎస్‌కేఎంఎస్‌ (కిసాన్‌ మోర్చా) చలో పార్లమెంటుకు మద్దతు, మార్క్సిస్టు సిద్ధాంతంపై అవమానకర వ్యాఖ్యలను తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చేయడానికి ఖండన, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ఖండన, జనవరి 30న దిల్లీలో జరిగిన కార్మికుల సదస్సు కార్యాచరణ ప్రణాళికకు మద్దతు ప్రకటిస్తూ మరికొన్ని తీర్మానాలను జాతీయ సమితి ఆమోదించింది. విలేకరుల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పుదుచ్చేరి కార్యదర్శి సలీం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img