Friday, April 19, 2024
Friday, April 19, 2024

బ్రిగేడియర్‌ లిద్దర్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులు

మిలటరీ హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్‌ లఖ్విందర్‌ సింగ్‌కు ఢల్లీిలోని బ్రార్‌ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి. బ్రిగేడియర్‌ లిద్దర్‌ భౌతికకాయం వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులు అర్పించారు. ఆయనతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, హర్యానా ముఖ్యమంత్రి మోహన్‌ లాల్‌ ఖట్టర్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌, ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి లిద్దర్‌కు నివాళులు అర్పించారు. బ్రిగేడియర్‌ లఖ్వీందర్‌ సింగ్‌ లిద్దర్‌కు అతని భార్య, కుమార్తె ఆయనకు నివాళులర్పించారు.జాతీయ జెండా, పూలతో అలంకరించిన లిద్దర్‌ శవపేటికను అతని భార్య ముద్దాడిరది. అతని కుమార్తె తండ్రి శవపేటికపై పూల రేకులను ఉంచి కన్నీళ్లు పెట్టుకుంది.చాలా మంది సీనియర్‌ రక్షణ సిబ్బంది కూడా బ్రార్‌ స్క్వేర్‌ వద్ద బ్రిగేడియరుకు చివరిసారిగా నివాళులర్పించారు.1969వ సంవత్సరం జూన్‌ 26వతేదీన జన్మించిన బ్రిగేడియర్‌ లిద్దర్‌ 2021జనవరి నుంచి సీడీఎస్‌ కు డిఫెన్స్‌ అసిస్టెంట్‌గా ఉన్నారు.అతను డిసెంబర్‌ 1990లో జమ్మూకాశ్మీర్‌ రైఫిల్స్‌ లో పనిచేశారు. యూఎన్‌ శాంతి పరిరక్షక దళంగా కాంగో బెటాలియన్‌కు నాయకత్వం వహించాడు. లిద్దర్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌లో డైరెక్టర్‌గా, కజకిస్తాన్‌లో డిఫెన్స్‌ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు.బ్రిగేడియర్‌ లిద్దరుకు భార్య గీతిక లిద్దర్‌, ఒక కుమార్తె ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img