Friday, April 19, 2024
Friday, April 19, 2024

బ్రిజ్‌భూషణ్‌కు ఏ పదవి ఉండరాదు: నారాయణ డిమాండ్‌

రెజ్లర్లకు సీపీఐ నేతల సంఫీుభావం

న్యూదిల్లీ: తమ గౌరవం కోసం పోరాడుతున్న మహిళా రెజ్లర్లకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పూర్తి మద్దతు తెలిపింది. పోరాటానికి, డిమాండ్లకు అండగా నిలుస్తామని పార్టీ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. రెజ్లర్లను వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా తొలగించాలని, ఆయన ఇతర ఏ హోదాలోనూ ఉండరాదని డిమాండ్‌ చేశారు. రెజ్లర్లతో ఆయన ప్రవర్తనను ఆక్షేపించారు. మహిళలు దేశ గౌరవమని, నిరసనకారులకు సీపీఐ అండగా నిలుస్తుందని తెలిపారు. రెజ్లర్ల పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళుతుందని చెప్పారు. నారాయణ శుక్రవారం దిల్లీ, జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న సాక్షిమాలిక్‌తో సహా రెజ్లర్లను కలిసి సంఫీుభావం తెలిపారు. ఆయన వెంట సీపీఐ దిల్లీ శాఖ నాయకులు ప్రొఫెసర్‌ దినేశ్‌ వార్షనే, శంకర్‌లాల్‌, అబ్సార్‌ అహ్మద్‌, ఖేహర్‌ సింగ్‌, ముకేశ్‌ కశ్యప్‌, రాజేశ్‌ కశ్యప్‌, సంజీవ్‌ కుమార్‌ రాణా, హైదర్‌ అలీ, శశికుమార్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నేత శారదా దేవి ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img