Friday, April 26, 2024
Friday, April 26, 2024

భాగస్తులందరి ఆమోదంతోనే ఆస్తి విక్రయం: సుప్రీం

న్యూదిల్లీ: ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఇతరులకు విక్రయించాలన్నా, బదిలీ చేయాలన్నా భాగస్వాములందరి సమ్మతి ఉంటేనే చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం లేని పరిస్థితుల్లో ఆస్తిని బదిలీ చేయరాదని జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఉమ్మడి కుటుంబ పెద్దగా ఉన్న తన తండ్రి…ఆయన పెంచుకున్న వ్యక్తికి బహుమతిగా 1/3వ వంతును ఆస్తిని రాసివ్వడాన్ని సవాలు చేస్తూ ఆయన కుమారుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో చట్టబద్ధమైన ఆవశ్యకత, ఎస్టేట్‌ ప్రయోజనం, కుటుంబ సభ్యులందరి ఆమోదం వంటి…మూడు సందర్భాల్లో మాత్రమే ఉమ్మడి ఆస్తిని కుటుంబ పెద్ద ఇతరులకు అప్పగించగలరని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. వారసత్వ ఆస్తిని కుటుంబ పెద్ద దైవ సంబంధిత కార్యక్రమాలకు మాత్రమే దానం చేయగలరని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. తాను పెంచుకున్న వ్యక్తికి ఆస్తిని రాసివ్వడాన్ని దైవ కార్యంగా భావించలేమని తెలిపింది. కుటుంబ సభ్యుల ఏకాభిప్రాయం లేనందున బహుమతిగా రాసి ఇచ్చిన పత్రం చెల్లదని గతంలో కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img