Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

భారతీయులుగా గర్వపడాలి.. మాతృభాషను గౌరవించాలి

లసవాద ఆలోచనను విడనాడాలి : యువతకు వెంకయ్య నాయుడు పిలుపు
హరిద్వార్‌ : భారతీయులమే గుర్తింపు గర్వకారణమని దేశప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. వలసవాద ఆలోచనశైలిని విడనాడాలన్నారు. 75వ స్వాతంత్య్ర వత్సరంలో మకౌలే విద్యావ్యవస్థను పూర్తిగా తిరస్కరించాలని, ఆ వ్యవస్థ ఓ విదేశీ భాషను దేశంలో విద్యా మాధ్యమంగా చేసిందని, తద్వారా సంపన్నులకే విద్యను పరిమితం అయిందని అన్నారు. ‘శతాబ్దాల వలసవాద పాలనలో మనల్ని మనం తక్కువ చేసుకోవడం అలవాటైంది. మన సంస్కృతి, సంప్రదాయాలను ఈసడిరచుకోవడం నేర్పబడిరది. తద్వారా దేశాభివృద్ధి కుంటుపడిరది. విద్యా మాధ్యమంగా విదేశీ భాష అమలుతో విద్య సమాజంలోని చిన్న వర్గానికే పరిమితం అయింది. మిగతా వారి విద్యాహక్కు నిరాకరించబడిరది. మనం భారతీయులుగా గర్వపడాలి. మన సంస్కృతి, సంప్రదాయాలను, మన పూర్వీకుల ఆచారాలను గర్వంగా భావించాలి. మూలాలను మర్చిపోరాదు. సాధ్యమైనన్ని భారతీయ భాషలను నేర్చుకోవాలి. మాతృభాషను ప్రేమించాలి. విజ్ఞాన సంపదలైన పురాణాలను చదివేందుకు సంస్కృతం నేర్చుకోవాలి’ అని దేవ్‌ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌతేషియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌ అండ్‌ రీకంసిలేషన్‌ ప్రారంభం సందర్భంగా వెంకయ్య యువతకు పిలుపునిచ్చారు. భారత్‌లో కొత్త విద్యా విధానం కోసం విద్యావ్యవస్థ భారతీయీకరణ కీలకమని అన్నారు. ‘భారతదేశానికి వచ్చే విదేశీయులు ఆంగ్లంలో కాకుండా తమ మాతృభాషలోనే మాట్లాడతారు. దానిని వారు గర్వంగా భావిస్తారు. విద్యా కాషాయీకరణ ఆరోపణలు వస్తున్నాయి. కాషయంలో తప్పు ఏముంది? సర్వే భవంతు సుఖినా (అంతా సఖసంతోషాలతో ఉండాలి), వసుదైవ్‌ కుటుంబం (ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం), ఇది మన తత్వసంప్రదాయం. పురాణాలు మనకు నేర్పుతున్న సిద్ధాంతాలు. భారత్‌కు దక్షిణాసియా దేశాలన్నింటితో పటిష్ట బంధం ఉంది. ఏ దేశంపైనా ముందుగా దాడి చేయదు. దీనిని యావత్‌ ప్రపంచం గౌరవిస్తుంది. ఇది చక్రవర్తి అశోకుని దేశం. ఆయన హింసను విడనాడి శాంతి, అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. నలంద, తక్షశిల వంటి పురాతన భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి మన దేశానికి వచ్చేవారు. ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్న భారత్‌ ఏ దేశంపైనా దాడికి వెళ్లదు’ అని వెంకయ్య అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img