Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భారత్‌పై మళ్లీ దావూద్‌ గురి

రాజకీయ నేతలు, బడావ్యాపారవేత్తలే లక్ష్యం

న్యూదిల్లీ: అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌పై మళ్లీ గురిపెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. ఇందుకోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తాజాగా వెల్లడిరచడం కలకలం రేపుతోంది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడిరచినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దావూద్‌ ఇబ్రహీంపై ఇటీవల ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలు పేర్కొన్నట్లు సమాచారం. దావూద్‌, తన ప్రత్యేక విభాగంతో కలిసి దేశవ్యాప్తంగా భీకర దాడులకు ప్రణాళికలు రచిస్తోన్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. బాంబు పేలుళ్లు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు వివరించింది. ప్రత్యేకించి దిల్లీ, ముంబైపై దావూద్‌ దృష్టిపెట్టినట్లు వెల్లడిరచింది. దావూద్‌ హిట్‌లిస్ట్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, బడావ్యాపారవేత్తల పేర్లు ఉన్నట్లు దర్యాప్తుసంస్థ పేర్కొన్నట్లు ఆ కథనాలు తెలిపాయి. ఈ చార్జిషీటు ఆధారంగా ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దావూద్‌పై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ముంబైలోని అనేక ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌ ఇంటికి అధికారులు వెళ్లినట్లు తెలిసింది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లోనూ సోదాలు జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి.
మాఫియా హవాలా లావాదేవీలు, అక్రమాస్తుల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌పైనా మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అతడిని కస్టడీలోకి తీసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img