Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారత్‌లోకి బీఎఫ్‌`7

మూడు కేసులు నమోదు
మాస్కులు తప్పనిసరి

. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం
. కరోనాపై అప్రమత్తత అవసరం
. నిఘా పటిష్టవంతం చేయండి
. అందరూ బూస్టర్‌ డోసులు వేసుకోండి
. కేంద్రమంత్రి మాండవీయ సమీక్ష

కోవిడ్‌-19 తొలిసారి వెలుగు చూసిన చైనాలో మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అయితే, ఈసారి అక్కడ వైరస్‌ విజృంభణకు ఒమిక్రాన్‌ ఉపరకమైన బీఎఫ్‌`7 కారణమని నిపుణులు చెబుతున్నారు.

న్యూదిల్లీ : కోవిడ్‌-19 తొలిసారి వెలుగు చూసిన చైనాలో మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. అయితే, ఈసారి అక్కడ వైరస్‌ విజృంభణకు ఒమిక్రాన్‌ ఉపరకమైన బీఎఫ్‌7 కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఆ వేరియంట్‌ భారత్‌కూ వ్యాపించింది. తొలి కేసును గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌ కేసులు ఇప్పటి వరకు మూడు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. గుజరాత్‌లో రెండు కేసులు, ఒడిశాలో మరో కేసు వెలుగు చూసినట్లు తెలిపాయి. భారత్‌లో కొత్త వేరియంట్‌ వెలుగు చూసినప్పటికీ మొత్తం కేసుల్లో పెరుగుదల గణనీయంగా లేదని కోవిడ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నిపుణులు వెల్లడిరచారు. అయినప్పటికీ...వ్యాప్తిలో ఉన్న వాటితోపాటు కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించారు. అధికారిక వర్గాల ప్రకారం చైనాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌, దాని ఉపరకాల విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్‌ వంటి నగరాల్లో బీఎఫ్‌7 వేరియంట్‌ ప్రధానంగా వ్యాప్తిలో ఉంది. ఈ వేరియంట్‌ కారణంగానే చైనా వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదివరకు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకపోవడం, వాక్సిన్‌ సమర్థత కారణంగా అక్కడి ప్రజలు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వంటివి చైనాలో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణంగా తెలుస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
బీఎఫ్‌7 వేరియంట్‌ అంటే ఏమిటి? ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ5కు చెందిన ఉపరకమే బీఎఫ్‌`7. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉంది. దీని ఇంక్యుబేషన్‌ వ్యవధి చాలా తక్కువ. అంతేకాకుండా రీఇన్‌ఫెక్షన్‌ లేదా వాక్సిన్‌ తీసుకున్న వారికీ ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉంది. చైనాలోనే కాకుండా అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి దేశాల్లోనూ ఈ వేరియంట్‌ ఇప్పటికే వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img