Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు..కలవరపెడుతున్న ఒమిక్రాన్‌

558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి క్రియాశీల కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈ క్రమంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.దీంతోపాటు.. కరోనా బారినపడి నిన్న 220 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 95,014 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఏడాదిన్నర తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గింది.తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,46,48,383కు పెరిగింది. ఇందులో 3,40,79,612 మంది కోలుకున్నారు.వైరస్‌తో ఇప్పటి వరకు 4,73,757 మంది మృత్యువాతపడ్డారు. కాగా నిన్న కరోనా నుంచి 10,004 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,40,79,612 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 128.76 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశంలో 64.94 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img