Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

భారీగా తగ్గిన కొత్త కేసులు

8,865 పాజిటివ్‌ కేసులు.. 197 మంది మృతి
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖంపడుతోంది. గడిచిన 24 గంటల్లో 8,865 మంది మహమ్మారి బారినపడ్డారు. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. మరోవైపు రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంటోంది. మరణాలు కూడా 200లోపే ఉండడం ఊరట కలిగిస్తోంది. కరోనా బారిన పడి నిన్న 197 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,852కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు కేరళవే కావడం గమనార్హం. ఆ రాష్ట్రంలో సోమవారం 4547 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 57 మంది మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కరోనా రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంటోంది. గత 24 గంటల్లో సుమారు 11971 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3.38 కోట్ల మంది కరోనాను జయించడంతో రికవరీ రేటు 98.27 శాతానికి చేరుకుంది. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,30,793. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం 59, 75, 469 మంది టీకాలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 1,12, 97, 84, 045 కోట్లకు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img