Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత చమురుసంస్థలు ధరలను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ధరలను పెంచుతూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెరుగుదల కనిపించింది. ఏకంగా ఒకేసారి పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెరిగాయి. మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢల్లీిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.21 గా ఉండగా, డీజిల్‌ రూ. 87.47 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.82 కాగా, డీజిల్‌ రూ. 95గా ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.16 గా ఉండగా, డీజిల్‌ రూ. 92.19 గా నమోదైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.42 కాగా, డీజిల్‌ రూ. 85.80 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img