Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మంకీపాక్స్‌ కేసుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం..ఇక రోజువారీ మానిటరింగ్‌

భారత్‌లో మంకీపాక్స్‌ భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తొలుత కేరళలో వెలుగుచూసిన మంకీపాక్స్‌ కేసులో ఇప్పుడు పలు రాష్టాల్ని భయపెడుతున్నాయి. దీంతో కేంద్రం కూడా దీన్ని తేలిగ్గా తీసుకునే పరిస్ధితి లేదు. ఇప్పటికే రాష్ట్రాల నుంచి పెరుగుతున్న డిమాండ్లతో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో పెరుగుతున్న మంకీపాక్స్‌ కేసుల నేపథ్యంలో రోగనిర్ధారణ సౌకర్యాల విస్తరణపై పర్యవేక్షణ, మార్గదర్శకత్వం కోసం, దేశంలో ఇన్ఫెక్షన్‌ కోసం టీకాను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందానికి నీతి ఆయోగ్‌ సభ్యుడు, గతంలోనూ కరోనా వ్యవహారాలు చూసిన డాక్టర్‌ వి.కె.పాల్‌ ను చీఫ్‌గా నియమించారు. సోమవారం వరకు భారత్‌లో 4 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో కేరళలో మూడు, ఢల్లీిలో ఒకటి వెలుగుచూశాయి.గత వారం కేరళలో మంకీపాక్స్‌ లాంటి లక్షణాలతో ఒక యువకుడు చనిపోయాడు. ఆ తర్వాత రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మంకీపాక్స్‌ వైరస్‌ గురించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, వ్యాధిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టిందని డాక్టర్‌ పాల్‌ ముందుగా సాధారణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 78 దేశాల్లో 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్‌ను అరికట్టేందుకు దేశాలు, సమూహాలు, వ్యక్తులు ప్రమాదాలను తీవ్రంగా పరిగణించి, ప్రసారాన్ని ఆపడానికి, హాని కలిగించే సమూహాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్‌ వ్యాప్తిని ఆపవచ్చని డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img