Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మంత్రి అజయ్‌ మిశ్రా క్రిమినల్‌ : రాహుల్‌ గాంధీ

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై పార్లమెంట్‌ ఉభయసభలు గురువారం దద్దరిల్లాయి. ప్రణాళిక ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇటీవల సంచలన విషయాలను వెల్లడిరచిన నేపథ్యంలో కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, అజయ్‌ మిశ్రా ఓ క్రిమినల్‌ అని, ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్‌ మాట్లాడుతూ.. లఖింపూర్‌లో జరిగిన మర్డర్‌ గురించి సభలో మాట్లాడనివ్వాలన్నారు.లఖింపూర్‌లో జరిగిన హింసాకాండలో రైతులు మరణించిన విషయం తెలిసిందే. అయితే దాంట్లో మంత్రి ప్రమేయం ఉన్నట్లు రాహుల్‌ ఆరోపించారు. మంత్రి కుట్ర పన్ని రైతుల్ని చంపేశారన్నారు. రైతుల్ని చంపిన మంత్రి రాజీనామా చేయాలని, ఆయన్ను శిక్షించాలని డిమాండు చేశారు. మరో వైపు విపక్ష సభ్యులు వెల్‌లో నినాదాలతో హోరెత్తించారు. లఖింపూర్‌ బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు పట్టుకుని విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లఖింపూర్‌ ఘటనపై చర్చ జరపాల్సిందేనని లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు ఆందోళన విరమించాలని స్పీకర్‌ వారించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభను 2 గంటల వరకు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img