Friday, April 19, 2024
Friday, April 19, 2024

మణిపూర్‌లో ఉగ్రదాడి..

కమాండిరగ్‌ అధికారి కుటుంబం మృతి

మణిపూర్‌లో చురాచంద్‌పూర్‌ జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. శనివారం అస్సాం రైఫిల్స్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి జరిగినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి . ఈ దాడిలో కమాండిరగ్‌ అధికారి, ఆయన కుటుంబసభ్యులు సహా పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అధికారిక నివేదికల ప్రకారం, 46 అస్సాం రైఫిల్స్‌ కమాండిరగ్‌ ఆఫీసర్‌ విప్లవ్‌ త్రిపాఠి శుక్రవారం తన బెహియాంగ్‌ కోయ్‌ పోస్ట్‌ను సందర్శించి, రాత్రి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. బెహియాంగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు 4 కిలోమీటర్ల దూరంలోని బెహియాంగ్‌ సమీపంలో శనివారం ఉదయం 10 గంటలకు ఆకస్మిక దాడి జరిగినట్లు మణిపూర్‌ పోలీసులు తెలిపారు. దాడిలో కల్నల్‌ త్రిపాఠి, అతని భార్య, కుమారుడితోపాటు తక్షణ సహాయ విభాగానికి చెందిన నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జవాన్లు గాయపడగా వారిని బెహియాంగ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్ర బలగాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి. కాగా, నిషేధిత మణిపురి తీవ్రవాద సంస్థ పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఎ) ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌ తీవ్రంగా ఖండిరచారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img