Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి

కృష్ణా నదీ జలాల వివాదంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
కృష్ణా నదీ జలాల వివాదంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. అక్టోబర్‌ నుంచి గెజిట్‌ అమలులోకి వస్తుందని తెలిపిన ఏపీ.. ఇప్పటి నుంచే గెజిట్‌ అమలు చేయాలని కోరుతున్నామని వాదించింది. నాలుగు నెలల పాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నామని పేర్కొంది.దీనిపై సీజేఐ.. కృష్ణా జలాల వివాదంపై గతంలో వాదించిన అనుభవం దృష్ట్యా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి ఇంకా ఏమైన సూచనలు కావాలంటే విచారణ వాయిదా వేసి మరో ధర్మాసనానికి బదిలీచేస్తామని చెప్పారు. ప్రభుత్వంతో సంప్రదించి ఇరువర్గాలు ఒక నిర్ణయానికి రావాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తరఫున హాజరైన న్యాయవాదులకు సూచించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img